Sunday, November 1, 2026
More
    HomeOpinionSrinivas Goud key appeal on BC Caste Census : బీసీ...

    Srinivas Goud key appeal on BC Caste Census : బీసీ కులగణనపై కేంద్ర హోం మం త్రి అమిత్ షా స్పందించాలి

    📰 Generate e-Paper Clip

    –జనగణనపై బీసీల అభ్యంతరాలను స్వీకరించాలి
    –బీసీల అన్యాయంపై బీసీ సంఘాలతో చర్చించాలి
    –బీసీ కాలమ్ చేర్చేవరకు ఉద్య మాన్ని ఆపేదిలేదు
    –బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

    Srinivas Goud key appeal on BC Caste Census : ప్ర జా దీవెన, హైదరాబాద్‌: దే శ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వ హిస్తున్న జాతీయ జనగణనలో బీసీలకు ఉన్న అభ్యంత రా లను చర్చించడానికి బీసీ సంఘాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబా ద్ పర్యటన సందర్భంగా సమయం ఇ వ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బిజె పి పార్టీ నేతలను ఆయన కోరారు. శనివా రం హైదరాబాదులోని బీసీ భవన్ లో బీసీ కుల సంఘాల జేఏ సీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావే శానికి ముఖ్య అతిథిగా బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షు లు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లా డుతూ నవంబర్ 2న హైదరాబా ద్ పర్యటనకు అమి త్ షా వస్తున్న దరిమిలా బీసీలకు ఓబీసీ కా లం పెట్టకుండా జనాభా లెక్కలు సేకరిస్తున్న తరుణంలో బీసీలకు చాలా అ న్యాయం జరుగు తుందని, ఈ అన్యాయాన్ని సరిదిద్ద డానికి అమిత్ షాచర్యలు తీసు కోవాలని ఆయన కోరారు.

    బీసీ కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి తీరా జన గణన చేపడుతున్న ఈ సమ యంలో ఎస్సీ, ఎస్టీల వలే బీసీ ల కు కూడా ప్రత్యేకమైన కాలం పె ట్టకుండా, ప్రతి కులా నికి ఒక యూనిక్ కోడ్ కేటాయించకపోవడంతో బీసీ కులగనన ప్రక్రియ మొత్తం నీరుగారి పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల లె క్కలు సేకరించకపోతే బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ద క్కే పరిస్థితి లేదని, దేశంలో అన్ని వర్గాలకు జనాభా దామాష్ ప్రకారం రాజ్యాంగ బద్ధమైన రిజర్వేష న్లు కల్పిస్తున్న కేంద్రం బీసీల విష యంలో మాత్రం 60 శాతం జనా భా ఉంటే 27% రిజర్వేషన్లు క ల్పించ డం మూలంగా స్వాతం త్రం సిద్ధించి 83 సంవత్సరాలు గ డిచి న బీసీలకు సామాజిక న్యా యం జరగడం లేదన్నారు బీసీ రి జర్వేషన్లు పెంచిన ప్రతిసారి న్యా యస్థానాలు కొట్టి వేస్తున్నా యని, బీసీల శాస్త్రీయమైన డేటా లేకుం డా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టులు అంగీకరించడం లేదని ఆయన తెలిపారు.

    అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లో 2024 సంవత్సరంలో బీసీ కు లాల లెక్కలు సేకరించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగం లో 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ రాష్ట్ర ప్రభుత్వం అ సెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని, చట్టం చేసి కేంద్రానికి పంపి సంవత్సర కాలం గడిచిన ఇంతవరకు ఆమోదం తెల పలేదని ఆయన అన్నారు. బీసీ కులగనన, రి జర్వేషన్లపై విధించి న 50% పరిమితి ఎత్తివేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని దేశ వ్యా ప్తంగా దశాబ్దాలుగా బీ సీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న ప్రభు త్వాలు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమన్నారు బీసీ డి మాండ్ ల సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నామని అందులో భాగంగానే డిసెంబర్ 14 15 ఢిల్లీలో కూడా ఆందోళన చేపట్టామని ఈ సందర్భంగా ఆ యన గుర్తుచేశారు.

    బీసీ సంఘాలకు కేంద్ర హోంమం త్రి సమయం ఇస్తే సంతోషిస్తా నని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీ సీల నిరసన ను తెలి య జేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సమావే శంలో బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వా హక అధ్యక్షులు కు ల్కచర్ల శ్రీని వాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తా టికొండ విక్రమ్ గౌడ్, బిసి యు వ జన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా, యువజన సం ఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ మేరు, ఇంద్రం రజక, అంతోజు బ్రహ్మచారి, బండిగారి రాజు, బంగారు వెంకటేష్, తది తరులు పాల్గొన్నారు.

    Srinivas Goud key appeal on BC Caste Census

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.