Delhi massive fire accident : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నిం పిం ది. మంగోల్ పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.రాత్రి సు మారు 9:30 గంటల సమయంలో ఫ్యాక్టరీ బేస్మెంట్లో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే దట్టమైన పొగ, మం టలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటి న ఘటనాస్థలానికి చేరుకుని సు మారు 20 ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫ్యాక్టరీలో చి క్కుకుపోయిన ఆరుగురిని సురక్షితంగా బయట కు తీసుకొచ్చా రు. అయితే ఈ ప్రమాదంలో నలుగురు కార్మి కులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికి త్స నిమిత్తం ఆసుపత్రికి తర లించారు.ఈ ఘటనతో మంగో ల్పురి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అ గ్నిప్రమా దానికి గల కారణాలపై అధికారులు విచారణ చేప ట్టాల్సి ఉంది.

