Sunday, November 1, 2026
More
    HomeOpinionIllegal youth egg donation racket busted : యువతుల అండాల అక్రమ వ్యాపారం గుట్టురట్టు,...

    Illegal youth egg donation racket busted : యువతుల అండాల అక్రమ వ్యాపారం గుట్టురట్టు, ఒక్కో యువతికి రూ.30 వేల ఆశ చూ పి అండాల సేకరణ,ఐవీఎఫ్ కేం ద్రాలకు సరఫరా

    📰 Generate e-Paper Clip

    Illegal youth egg donation racket busted  : ప్రజా దీవె న, హైదరాబాద్: హైద రాబాద్‌లో యువతుల అండాల అక్రమ సేకరణ, విక్రయాల వ్యవ హారం కలకలం రేపుతోంది. అ మా యక యువతులకు డబ్బు ఆశ చూపి వారి నుంచి అండాలు సేకరించి, వాటిని ఐవీఎఫ్ కేంద్రాలు, ఆస్పత్రులకు విక్రయిస్తు న్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారం లో కీల కంగా వ్యవహరిస్తున్న దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకు ని ఈ అక్రమ దందా సాగిస్తున్న ట్లు తెలుస్తోంది. ఒక్కో యువ తికి సుమారు రూ.30 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపి అం డాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

    వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముసుగులో దందా

    రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీ పంలోని వెంకటేశ్వర కాలనీలో ‘శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్’ పేరుతో నిర్వహిస్తున్న ఇంట్లో ఈ కార్యకలాపాలు సాగుతున్న ట్లు పోలీసు లు గుర్తించారు. సుమారు 16మంది యువతుల నుంచి అండాలు సేకరించి వివిధ ఐవీఎఫ్ ఆస్పత్రులకు సరఫ రా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

     

    ఇతర నగరాలకూ అండాల సరఫరా?

    సేకరించిన అండాలను హైదరా బాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని ఐవీఎఫ్ కేంద్రాలు, ఆస్పత్రులకు విక్రయి స్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో హా ర్మోన్ల సరఫరా, వినియోగానికి సంబం ధించిన అంశాలపైనా పోలీసులు దృష్టి సారించారు.విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎ స్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి దుర్గా ప్ర సాద్‌ను అదుపు లోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బేగంపేట, సరూర్‌ నగర్ ప్రాంతాల్లో రెండు ముఠాల కార్యక లా పాలపైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. సు మారు 30 మంది యువ తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

    యువతుల అండాల సేకరణ వె నుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఏయే ఆస్పత్రులు, ఐవీఎఫ్ కేంద్రాలకు సరఫరా చేస్తు న్నారు? ఈ వ్యవహారంలో నిబంధనల ఉ ల్లంఘనలు జరిగా యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవ కాశం ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.