Tragedy road accident in Nalgonda district : ప్రజా దీవెన, కట్టంగూరు: జాతీ య రహదారి NH-65పై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. కట్టంగూరు మండలం అ యి టిపాముల గ్రామ శివారులోని చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తు న్న లారీ, హైవేపైకి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనం పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే ఘటనా స్థలాని కి చే రుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చి కిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేక ల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమో దు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయ లు అలముకున్నాయి.హైవేపై వాహనదారులు అ ప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచి స్తున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

