–ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లం ఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
Nalgonda SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: భారత దే శానికి వచ్చే విదేశీ పౌరులకు వ సతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్ లు, పీజీ వసతులు, హాస్టళ్లు, ఆ సుపత్రులు, విద్యాసంస్థలు, హో మ్‌స్టేలు, ప్రైవేట్ ఇళ్ల యజమా నులు తదితరులు ఇమ్మిగ్రేషన్ ని బంధనలను తప్పనిసరిగా పా టించాలని జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ సూచించారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మం త్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆ ఫ్ ఇమ్మిగ్రేషన్, హైదరాబాద్ ఫారి నర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) జారీ చేసిన పబ్లిక్ అ డ్వైజరీ ప్రకారం విదేశీ పౌరుల రా కపోకలకు సంబంధించిన వివరా లను నిర్ణీత సమయంలో ఆన్‌లై న్‌లో నమోదు చేయడం వసతి కల్పించే వారి చట్టబద్ధమైన బా ధ్యత అని తెలిపారు.
ఫార్మ్-III నమోదు తప్పనిసరి
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యా క్ట్, 2025లోని సెక్షన్ 8 ప్రకారం వి దేశీ పౌరులకు వసతి కల్పించే వ్యక్తులు, సంస్థలు వారి రాక, ని ష్క్రమణ వివరాలను ఫార్మ్-III (గతంలో ఫార్మ్-C) ద్వారా ఆ న్ లైన్‌లో సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఈ నిబంధన లు OCI కార్డు కలిగిన విదేశీ పౌ రులు, నేపాల్, భూటాన్ పౌరుల తో సహా వర్తించే విదేశీ పౌరుల వి షయంలో పాటించాల్సి ఉంటుం దని సూచించారు. విదేశీ అతిథి వచ్చిన 24 గంటల్లోగా సంబంధి త వివరాలను నమోదు చేయా లని, నమోదు చేసిన రికార్డులను ఒక సంవత్సరం పాటు భద్రపర చాలని తెలిపారు.
హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, Airbnb వసతులు, పీజీలు, హా స్టళ్లు మాత్రమే కాకుండా విదేశీ అతిథులకు వసతి కల్పించే ప్రై వేట్ ఇళ్ల యజమానులు, హోమ్ స్టే నిర్వాహకులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర వసతి ప్ర దాతలు కూడా తమకు వర్తించే నిబంధనలను తెలుసుకుని అ మలు చేయాలని ఎస్పీ సూచిం చారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవా లి
విదేశీ పౌరులకు వసతి కల్పించే వారు అధికారిక వెబ్‌సైట్ http s://indianfrro.gov.in ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చే యాలి. ముందుగా పోర్టల్‌లో రి జిస్ట్రేషన్ చేసుకుని, అవసరమై న వివరాలు సమర్పించి, సంబం ధిత కార్యాలయం నుంచి లాగిన్ వివరాలు పొందిన అనంతరం వి దేశీ అతిథుల వివరాలను నిర్ణీత గడువులోగా నమోదు చేయాలి. వసతి ప్రదాతలు తమకు వర్తించే మాడ్యూల్, అవసరమైన పత్రా లు, సమర్పణ విధానం గురించి అధికారిక పోర్టల్‌లోని సూచనల ను అనుసరించాలని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
విదేశీ పౌరుల వివరాలను నిర్ణీత సమయంలో నమోదు చేయక పోవడం, చెల్లుబాటు అయ్యే పా స్‌పోర్ట్ లేదా వీసా లేకుండా వి దే శీయులకు వసతి కల్పించడం, న కిలీ ప్రయాణ పత్రాలను ఉపయో గించడం, వీసా గడువు ముగిసి న తర్వాత కూడా అక్రమంగా దే శంలో ఉండటం వంటి ఉల్లంఘన లకు సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం జరిమానాలు, క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్ట పరమైన చర్యలు ఎదురయ్యే అ వకాశం ఉందని ఎస్పీ హెచ్చరిం చారు. ఆసుపత్రులు, విద్యాసం స్థలు కూడా తమకు వర్తించే ప్ర త్యేక రిపోర్టింగ్ నిబంధనలను పాటించాలని సూచించారు.
విదేశీ పౌరులు కూడా నిబం ధనలు పాటించాలి
భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు చెల్లుబాటు అయ్యే పా స్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలని, వీ సా నిబంధనలకు అనుగుణంగా తమ నివాసాన్ని కొనసాగించాల ని సూచించారు. నివాస చిరునా మా మారినప్పుడు వర్తించే విధం గా సంబంధిత అధికారులకు తె లియజేయాలని, పాస్‌పోర్ట్ లేదా వీసా పోగొట్టుకున్న సందర్భంలో వెంటనే స్థానిక పోలీసులకు, FR RO అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. విద్యా ర్థులు తమ వీసా నిబంధనలను పాటించడంతో పాటు విద్యాసం స్థ లేదా కోర్సు మార్పులకు సం బంధించిన వివరాలను అవసర మైన విధంగా అప్‌డేట్ చేయాలి. తప్పుడు పత్రాలను సమర్పించ డం, వీసా గడువు దాటిన తర్వా త దేశంలో కొనసాగడం, అనుమ తి లేని కార్యకలాపాలకు పాల్పడ టం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
విదేశీ పౌరులకు వసతి కల్పించే యజమానులు, నిర్వాహకులు ఈ నిబంధనలపై అవగాహన పెం చుకుని సకాలంలో ఆన్‌లైన్ న మోదు ప్రక్రియను పూర్తి చేయా లని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ కోరారు. చట్ట నిబంధనలను పాటించడం ద్వారా అనవసరమై న చట్టపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని తెలిపారు.

