Thursday, November 5, 2026
More
    HomeOpinionAcb trapped SUB inspector of police : రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి...

    Acb trapped SUB inspector of police : రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, ఆత్మహత్య కేసులో ఇరికిస్తానంటూ బాధితుడికి బెదిరింపులు

    📰 Generate e-Paper Clip

    –-మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేందు కు లంచం డిమాండ్
    –పెట్రోల్ బంక్ వద్ద ఏసీబీ ట్రాప్‌

    Acb trapped SUB inspector of police : ప్రజా దీవెన, ఆ దిలాబాద్: అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా మరోసారి ఝ ళిపించింది. ఓ ఆత్మహత్య కేసును అడ్డుపెట్టుకుని ఫిర్యాదు దారుడిని బెదిరిస్తూ రూ.40 వేల లంచం డిమాండ్ చేసిన పో లీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలకు చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న జి. ర మేష్‌ను బుధవారం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకు న్నారు.

    వివరాల్లోకి వెళ్తే.. ఓ అవివాహిత మహిళ ఆత్మహత్యకు సం బంధించిన కేసు (BNSS సెక్షన్ 194) లో ఫిర్యాదుదారుడిని నిందితుడి గా చేర్చకుండా ఉండటంతో పా టు, తన వద్ద ఉం చుకున్న అతడి మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందు కు ఎస్‌ఐ లంచం డిమాండ్ చేసి నట్లు ఏసీబీ వెల్లడించింది. ఆత్మ హత్య కు ముందు మహిళ ఫిర్యాదుదారుడికి చివరి ఫోన్ కాల్ చే యడాన్ని ఆసరాగా చేసుకున్న ఎస్‌ఐ, కేసులో ఇరికిస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉ న్నాయి.

    మొదట రూ.50 వేల లంచం అ డిగిన ఎస్‌ఐ, ఫిర్యాదుదారుడి అ భ్యర్థనతో రూ.40 వేలకు తగ్గిం చారు. దీంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళి కతో రంగంలోకి దిగిన ఏసీబీ అ ధికారులు, గ్రామ శివారులో ని ర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ వ ద్ద ట్రాప్ ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ సూచనల మేరకు సెంటరింగ్ బా క్సుల కింద ఫిర్యాదుదారుడు రూ.40 వేల నగదును ఉంచగా, ఏసీబీ అధికారులు లంచం వ్యవ హారాన్ని గుర్తించి చర్యలు చేప ట్టారు.

    అధికార హోదాను అడ్డుపెట్టుకు ని అక్రమంగా లబ్ధి పొందేం దుకు ప్రయత్నించిన ఎస్‌ఐను అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్‌లో ని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించే ప్ర క్రియ చేపట్టారు. ఈ కేసులో తదుపరి విచారణ కొన సాగుతోం ది. ఫిర్యాదుదారుడి భ ద్రత దృష్ట్యా అతడి వివరాలను ఏసీబీ గోప్యంగా ఉంచింది.

    లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. వాట్సా ప్: 9440446106, ఫేస్‌బుక్: Tel angana ACB, ఎక్స్ (ట్వి ట్టర్): @Telangana ACB ద్వారా కూ డా సంప్రదించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహి రంగ ప్రదేశాల్లో ఏ ర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యా దుదారుల పేర్లు, వివరాలను గో ప్యంగా ఉంచుతామని ఏసీబీ స్ప ష్టం చేసింది.

    Acb trapped SUB inspector of police

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.