Thursday, November 5, 2026
More
    HomeOpinionAIKS National Conference in Nalgonda : పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభల...

    AIKS National Conference in Nalgonda : పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభల కు సర్వం సిద్ధం

    📰 Generate e-Paper Clip

    –నవంబర్ 15న లక్ష మంది రైతు లతో భారీ ప్రదర్శన
    –ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ
    –నాలుగు రోజుల పాటు 36వ జాతీయ మహాసభలు
    –950 మందికి పైగా ప్రతినిధు లు, నాయకుల హాజరు

    AIKS National Conference in Nalgonda :ప్రజా దీవెన, నల్లగొండ : చారిత్రా త్మక రైతాంగ పోరాటాలకు వేదికగా నిలిచి న పోరాటాల పురిటిగ డ్డ నల్గొండలో అఖిల భారత కిసాన్ స భ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలకు రంగం సిద్ధమ వు తోంది. నవంబర్ 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహా సభలను విజయవంతం చేయాల ని రైతు సంఘం జాతీయ నాయకులు, ఆహ్వాన సంఘం అ ధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా న వంబర్ 15న లక్ష మంది రైతులతో నిర్వహించనున్న భారీ ప్రద ర్శన, అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహి రంగ సభకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

    గురువారం దొడ్డి కొమురయ్య భ వన్‌లో నిర్వహించిన మ హా సభ ల సన్నాహక సమావేశంలో జూలకంటి రంగారెడ్డి మాట్లా డుతూ దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిల భారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా కొనసాగుతోందని తెలిపారు. సామ్రాజ్య వాదం, భూ స్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక పో రా టాల స్ఫూర్తితో రైతాంగ హ క్కుల పరిరక్షణకు సంస్థ నిరంత రం ఉద్యమిస్తోందన్నారు. తెలం గాణ సాయుధ రైతాంగ పో రా టం, తెభాగా, వర్లీ ఆదివాసీ, పు న్నప్ర-వయలార్, సుర్మా లో య రైతాంగ పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ నయా ఉ దారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతులను ఐక్యం చేస్తున్నట్లు వివరించారు.

    రైతాంగం సంక్షోభంలో.. విధానాల మార్పు అవసరం

    దేశానికి అన్నం పెట్టే రైతాంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నె ముకగా ఉన్న శ్రమజీవులు ప్ర స్తుతం అనేక సమస్యలను ఎదు ర్కొంటున్నారని రంగారెడ్డి ఆవే దన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అ మ లవుతున్న ఆర్థిక విధానాలు, అ సమాన మార్కెట్ వ్యవస్థ, బల హీనమైన సామాజిక భద్రత, ప్ర కృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగ సంక్షోభాన్ని మరింత తీవ్ర తరం చేస్తున్నాయని విమర్శించారు.

    2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీ జేపీ ప్రభుత్వం రైతుల ఆదా యా న్ని రెట్టింపు చేస్తామన్న హామీని నెరవేర్చలేదని, వ్యవసాయ సం క్షోభానికి శాశ్వత పరిష్కారం చూ పడంలో విఫలమైందని ఆరోపించారు. పెట్టు బడి ఖర్చులు పెరు గుతున్నప్పటికీ పంటలకు గిట్టుబాటు ధర లు లభించక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కా ర్మికుల కు కనీస వేతనాలు, గ్రా మీణ పేదలకు ఉపాధి, భూమిలేని ని రుపేదలకు భూమి, ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించే లా ప్రభుత్వాలు సమగ్ర విధానాలను అమలు చేయాలని డి మాండ్ చేశారు.

    ఐక్య ఉద్యమాలే రైతాంగ సమ స్యలకు పరిష్కారం

    రైతులు, కౌలు రైతులు, వ్యవసా య కార్మికులు, గిరిజనులు, మ హిళా రైతులు ఐక్యంగా ఉద్య మించాల్సిన అవసరం ఉం దని జూలకంటి రంగారెడ్డి పిలుపుని చ్చారు. కులం, మతం పే రుతో ప్రజలను విభజించే ప్రయత్నాలకు బదులుగా భూమి, జీ వనోపాధి, ఉపాధి, ఆహార భద్రత వంటి మౌలిక సమస్యలపై ప్ర జలు సంఘటితం కావాలని కోరారు.

    నవంబర్ 14న రైతు ఎగ్జిబిషన్..15న భారీ ప్రదర్శన

    నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే 36వ జాతీయ మహాస భలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 950 మందికి పైగా ప్రతిని ధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు.మహాసభలలో భాగంగా నవం బ ర్ 14న రైతు ఎగ్జి బిషన్ నిర్వ హించనున్నారు. ఇందులో వ్యవ సాయ రంగ చరి త్ర, చారిత్రక రై తాంగ పోరాటాలు, ఉద్యమాలు, ప్రస్తుత వ్య వ సాయ పరిస్థితుల ను ప్రతిబింబించే అంశాలను ప్రదర్శించ ను న్నారు.నవంబర్ 15న నల్గొండ నగరంలో లక్ష మంది రైతు ల తో భారీ ప్రదర్శన నిర్వహిం చి, అనంతరం ఎన్జీ కళాశాల మై దానంలో భారీ బహిరంగ సభ జరపనున్నారు. రైతాంగ సమ స్యలు, వ్యవసాయరంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్ష ణపై దేశవ్యాప్త చర్చకు ఈ జాతీయ మహాసభలు కీలక వేది కగా నిలవనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

    ఈ సమావేశంలో సీఐటీయూ రా ష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్య క్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ కం దాల ప్రమీ లతో పాటు ప్రజాసంఘాల నాయకులు నారి ఐల య్య, డబ్బి కార్ మల్లేష్, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావ తి, ఎండీ స లీం, దండెంపల్లి సత్తయ్య, కంబా లపల్లి ఆనంద్, అవిశెట్టి శంకర య్య, బొజ్జ చిన్న వెంకులు, చింతపల్లి బయన్న, రాసకొండ వెంకట్ గౌడ్, కొండ అనురాధ, రవి నాయక్, మల్ల య్య, రెమిడాల పరుశరాములు, ఉడుగుండ్ల రాములు తదిత రులు పాల్గొన్నారు.

    AIKS National Conference in Nalgonda

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.