–కట్నీ జిల్లాలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
–మూడంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు
Madhya Pradesh massive Fire Accident : ప్రజా దీవెన, మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాణసంచా దుకాణంలో చెలరేగిన భారీ అగ్నికీలలు ఒకే కు టుంబానికి చెందిన ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. మృ తుల్లో కేవలం రెండు నె లల పసికందు కూడా ఉండటం అంద రినీ కలచివేస్తోంది.కట్నీ జిల్లా బర్హీ ప్రాంతంలోని ఓ బాణ సం చా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాణసం చా నిల్వలు ఉండటంతో అగ్నికీ లలు వేగంగా వ్యాపించి మూ డు అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో భవనంలో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకుండాపోయింది.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు హు టాహుటిన ఘటనా స్థలానికి చే రుకుని సహాయక చర్య లు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న వా రిని వెలికితీసేందుకు జేసీబీ యంత్రంతో గోడను కూల్చివేశారు. అనంతరం శిథిలాల మధ్య నుంచి ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు.ఒకే కు టుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడటం స్థానికం గా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

