Monday, November 16, 2026
More
    HomeతెలంగాణRs. 5 lakh life insurance guarantee for every family : బిగ్ బ్రేకింగ్,...

    Rs. 5 lakh life insurance guarantee for every family : బిగ్ బ్రేకింగ్, ప్రతికుటుంబానికీ రూ.5 లక్షల జీవితబీమా భరోసా నవంబర్ 19న ‘ఇందిరమ్మకుటుంబ జీవితబీమా’ పథకం ప్రారంభం

    📰 Generate e-Paper Clip

     

    Rs. 5 lakh life insurance guarantee for every family : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలం గాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందు ల్లో చి క్కుకోకుండా అండగా నిలిచేందుకు ‘ఇందిరమ్మ కు టుం బ జీవిత బీమా పథకం’ అమలుకు ప్రతిపా దనలు సిద్ధం చే సింది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం ల క్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్ర మార్క మల్లు ఈ పథకానికి సంబంధించి న వివరాలను వెల్లడించారు.

     59 ఏళ్ల వయస్సు వారికి అవకాశం

    కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల మధ్య వ యస్సు కలిగిన ఒక సభ్యుడిని బీమా పొందే వ్యక్తి గా ప్రతిపాదించారు. వయస్సు ధ్రువీకరణకు ఆధా ర్ కార్డును ప్రా మాణికంగా తీసు కోనున్నారు. కాగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరిం చుకుని నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు నుంచి ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పా ట్లు చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సుల భంగా అందు బాటులో ఉండేలా గ్రామాలు, పట్టణాల్లో క్యాం పులు నిర్వహించనున్నారు.

    పథకం ప్రధాన ఉద్దేశాలు ఇవే

    –ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం,
    –కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆర్థిక సహాయం అందిం చడo
    –కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షో భంలోపడకుండా అండగా నిలవడం
    –ప్రతి కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం.

    మరిన్ని వివరాలకై సంప్రదించాలి?

    పథకానికి సంబంధించిన దరఖా స్తులు, అర్హతలు, విధివిధానా ల వివరాల కోసం సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయం, గ్రా మపం చాయతీ లేదా ము న్సిపల్ కా ర్యాలయాన్ని సంప్రదిం చాలి. ప్రభుత్వం ప్రకటించే అధికారిక మా ర్గదర్శకాల ప్రకారం దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ పథకం అ మలులోకి వస్తే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు జీవిత బీమా రక్షణ అందించే అవకాశం ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.