Tuesday, November 17, 2026
More
    HomePoliticsCheyutha Pension Irregularities : చేయూత పింఛన్ల పంపిణీలో అ క్రమాలకు పాల్పడితే కఠిన చర్య...

    Cheyutha Pension Irregularities : చేయూత పింఛన్ల పంపిణీలో అ క్రమాలకు పాల్పడితే కఠిన చర్య లు

    📰 Generate e-Paper Clip

    –ఇందిరమ్మ జీవిత బీమా పథకం పై విస్తృత ప్రచారం చేపట్టాలి
    –నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

    Cheyutha Pension Irregularities : ప్రజా దీవెన, నల్లగొండ: చేయూ త పింఛన్ల పంపిణీలో ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వ సూలు చేసినట్లు ఫిర్యాదులు వ స్తే బాధ్యులపై కఠిన చర్యలు తీ సుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ప్రారం భించనున్న ఇందిరమ్మ జీవిత బీ మా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిం చాలని అధికారులను ఆదేశిం చారు.మంగళవారం ఆయన కలె క్టర్ కార్యాలయం నుండి ఎంపీ డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేయూత పింఛన్ల పంపిణీ బాధ్యతను కార్యదర్శు లు, వార్డు అధికారులే సమర్థవం తంగా నిర్వహించాలని, పంపిణీ సమయంలో ఎలాంటి అక్రమాల కు తావులేకుండా చూడాలని సూచించారు.ఈ నెల 19న ప్రా రంభం కానున్న ఇందిరమ్మ జీవి త బీమా పథకాన్ని అర్హులైన ప్ర జలందరూ సద్వినియోగం చేసు కునేలా అధికారులు కృషి చేయా లని కలెక్టర్ పిలుపునిచ్చారు.

    జిల్లాలో ఉన్న సుమారు 4 లక్షల 86 వేల ఇళ్లకు సంబంధించి పథ కం వివరాలను ప్రజలకు తెలియ జేయాలన్నారు. గ్రామాల్లో ఫ్లెక్సీ లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం తో పాటు, మున్సిపాలిటీల్లో ఆ టోల ద్వారా ప్రచారం నిర్వహిం చాలని, ప్రతి వార్డులో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.రోజుకు 15 వేల ద రఖాస్తులు నమోదు చేసేలా ల క్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయా లని ఆదేశించారు. ప్రతి గ్రామం లో ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేసి, దరఖాస్తుల స్వీకరణకు అవసర మైన కంప్యూటర్లు, ప్రింటర్లు అం దుబాటులో ఉంచుకోవాలన్నా రు.

    కంప్యూటర్లు లేని గ్రామాల్లో ఎంపీ డీవో కార్యాలయాల ద్వారా దర ఖాస్తులను అప్‌లోడ్ చేయాలని సూచించారు.టీఎంసీ,. కే జిబివి పాఠశాలల్లో అందుబాటులో ఉ న్న కంప్యూటర్లను కూడా అవ స రమైన చోట వినియోగించుకో వా లని తెలిపారు. నేరేడు గోమ్మ వై జాగ్ కాలనీ వంటి నెట్‌వర్క్ సౌక ర్యం లేని ప్రాంతాల్లో దరఖాస్తుల ను భౌతికంగా స్వీకరించి సంబం ధిత కార్యాలయాల్లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. దరఖా స్తుల్లో ఆధార్ నంబర్లు నమోదు చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్త లు తీసుకోవాలని, ఎలాంటి త ప్పులు జరగకుండా ఒకటికి రెం డుసార్లు పరిశీలించిన తర్వాతే ఫారాలు పూర్తి చేయాలని సూ చించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిష నర్లు పూర్తి బాధ్యత వహించాల ని స్పష్టం చేశారు.

    వీబిజీ రాంజీ పనులను 100 శా తం పూర్తి చేయాలని, ఇప్పటివర కు పనులు ప్రారంభించని గ్రామా లలో వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులను భా గస్వాములను చేసి గ్రామస్థాయి లో పనుల పురోగతిని వేగవం తం చేయాలన్నారు.జలసిరి ప నుల్లో తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఇప్పటికే మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని సూచించా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని తెలిపారు.

    ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల ను పూర్తి చేయాలని, అంగన్‌వా డీ కేంద్రాలు, పాఠశాలల్లో మరు గుదొడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని ఆదే శించారు. ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు అవసరమైన అనుమతులు వెం టనే పొంది, పనులను గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ఎంపీడీవో లు అన్ని యూనిట్ల పనుల పురో గతిని నిరంతరం పర్యవేక్షించాల ని, సర్పంచులతో సమన్వయం తో గ్రామాల అభివృద్ధికి సంబం ధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అ భివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు స మన్వయంతో, బాధ్యతాయు తంగా పనిచేసి లక్ష్యాలను సాధిం చాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అ భివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి జీ. రమే ష్ , మండల ప్రత్యేక అధికారులు
    మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీ వోలు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.