Wednesday, November 18, 2026
More
    Homeనల్గొండMassive Workers Protest in Delhi from December1 : సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్...

    Massive Workers Protest in Delhi from December1 : సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు కీలక ప్రకటన, కార్మిక, రైతాంగ హక్కుల కోసం సమరశంఖం, డిసెంబర్ 1నుంచి ఢిల్లీలో కార్మికుల మహాపోరు

    📰 Generate e-Paper Clip

     

    –కనీస వేతనం రూ.42 వేలు.. పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్
    –నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాల పిలుపు
    –లక్షలాది మంది కార్మికులతో పార్లమెంట్ ముట్టడికి సన్నాహాలు
    –స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

    Massive Workers Protest in Delhi from Decemb er1: ప్రజా దీవెన, నల్లగొండ: కార్మికుల హక్కుల పరిరక్షణ, రై తాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉద్య మాలు ఉధృతం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను ని రసిస్తూ కార్మిక, రైతు సంఘాలు ఐక్య కార్యాచరణకు సిద్ధమ వుతున్నా యి. డిసెంబర్ 1 నుం చి 3వ తేదీ వరకు దేశ రాజ ధాని ఢిల్లీలో లక్షలాది మంది కార్మికులతో పార్ల మెంట్ ముట్టడి నిర్వహించనున్నట్లు సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు ప్రక టించారు. మరోవైపు రైతాంగ హక్కుల సాధన కోసం దేశవ్యా ప్త పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని అఖి ల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్య క్షుడు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ స్ప ష్టం చేశా రు. నల్లగొండలో బుధవారం నిర్వహించిన విలే కరుల సమావేశం లో ఏఆర్ సింధు మాట్లాడుతూ.. కార్మికులు దశాబ్దాల పోరా టంతో సాధించుకున్న హక్కుల ను నాలుగు లేబర్ కోడ్స్ ద్వా రా కేంద్ర ప్రభుత్వం బల హీనపరుస్తోందని విమర్శించారు. ఉ ద్యోగ భద్రత, కార్మి క సంఘాల ఏర్పాటు స్వేచ్ఛకు ఈ కోడ్స్ ముప్పుగా మా రతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    కార్మికులకు నెలకు కనీసం రూ.42 వేల వేతనం, ఉద్యో గ విరమణ చేసినవారికి, స్వయం ఉపాధి పొందుతు న్నవారికి రూ.21 వేల పెన్షన్ అందించా లని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్స్‌ను ర ద్దు చేయాలని, కాం ట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వ త ఉ ద్యోగులుగా గుర్తించాలని కోరారు. అంగన్‌వాడీ, ఆ శా, మధ్యాహ్న భోజన పథకం వంటి విభాగాల్లో పనిచేస్తున్న కో ట్లాది మంది స్కీమ్ వ ర్కర్ల సమస్యల ను ప్రభుత్వం పట్టిం చు కోవడం లేదని సింధు విమ ర్శించారు. 2018 తర్వాత వారి వే తనాలు పెంచక పోవడం దారుణమన్నారు. స్కీమ్ వర్కర్లం దరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, గ్రా ట్యుటీ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్ర భుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చే యాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీ కరణను నిలి పివేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉ ద్యమానికి సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సం ఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు.

    సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాము లు, ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రా ష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అసంఘటిత, భవన నిర్మాణ, స్కీమ్ వర్క ర్లను సమీకరించి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని పిలుపునిచ్చా రు.మరోవైపు నల్లగొండలో జరి గిన విలేకరుల సమావే శంలో ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, ప్ర ధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ రైతాంగ స మస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పోరాటా లను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. కరువు, ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకో వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కరువు ప్రభావిత 342 జిల్లాల రైతులకు తక్షణ ఆర్థిక సహా యం అందించాలని, ఆహార పంటలకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పు న నష్టపరిహారం చె ల్లించాలని డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణాలు, ఉచిత విత్త నాలు, పెట్టుబడి సబ్సిడీలు కల్పించాలని కోరారు.

    స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి

    రైతులకు పెట్టుబడి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీ స మద్దతు ధర ప్రకటించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫా ర్సులను పూర్తిస్థాయిలో అమలు చే యా లని ధావలే డిమాం డ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించి, రోజు కు రూ.700 కూలీ చెల్లించాలని కోరారు.2020-21లో రైతులు ఏడాది పాటు సాగించిన చారి త్రాత్మక ఉద్య మం కారణంగానే మూడు వ్యవసాయ చట్టాల ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. అయి న ప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, పంట ల బీమా, రైతులకు పెన్షన్ వంటి డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదన్నారు.

    నల్లగొండ గడ్డపై 36వ జాతీయ మహాసభలు

    నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించిన ఏ ఐకేఎస్ 36వ అఖిల భారత మహాసభలు విజ యవంతమ య్యాయని అశోక్ ధావలే తెలిపారు. దేశం లోని వివిధ రాష్ట్రా ల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరై రైతాంగ సమస్యలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారని చెప్పారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు నిల యమైన నల్లగొండలో జాతీయ మహాసభలు నిర్వ హిం చడం గర్వకారణమన్నారు. రైతులు, కార్మికులు, ప్రజాస్వామిక శక్తుల ను ఐక్యం చేసి వ్యవసాయ రంగాన్ని కా ర్పొరేట్ శక్తుల ఆధిప త్యం నుంచి కాపాడేందుకు పోరాటాలు కొనసాగిస్తామని స్ప ష్టం చేశారు.

    ఏఐకేఎస్ నూతన జాతీయ నాయకత్వం ఎన్నిక

    మహాసభల్లో ఏఐకేఎస్ నూతన జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజ్జు కృష్ణన్, కోశా ధికారిగా పు ష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారు. మొత్తం 27 మందితో జాతీయ కార్యాలయ బాధ్యుల కమిటీ, 167 మందితో జాతీయ కిసాన్ కమిటీ, 86 మందితో కేంద్ర కిసాన్ కౌన్సిల్ ఏర్పాటు చేశా రు. తెలంగాణ నుంచి టీ. సాగర్, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి సహా పలువురు జాతీయ కమిటీలో స్థానం దక్కిం చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.

    నవంబర్ 26న దేశవ్యాప్త నిరసనలు

    రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 26న దేశవ్యా ప్తంగా నిరసనలు నిర్వహించాలని మహాసభ నిర్ణయించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ సిఫార్సుల అ మలు, కరువు పరిహారం, సమగ్ర పంటల బీమా ప్రధాన డి మాండ్లుగా ఉద్యమాలు చేపట్టనున్నారు.అలాగే డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢి ల్లీలో కార్మికులతో భారీ పార్లమెంట్ ముట్టడి నిర్వహిం చాలని నిర్ణయించారు. రైతులు, కార్మికుల సమ స్య లపై ఉమ్మడి పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని పిలు పు నిచ్చారు.మొత్తంగా నల్లగొండలో జరిగిన కార్మిక, రైతు సంఘా ల ప్రకటనలు దేశవ్యాప్త ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేశా యి. కనీస వేతనం నుంచి కనీస మద్ద తు ధర వరకు హక్కుల సాధనే లక్ష్యంగా కార్మిక, రైతాంగ శక్తులు ఐక్య పోరాటానికి సిద్ధ మవుతున్నాయి.

    Massive Workers Protest in Delhi from December1

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.