Thursday, November 19, 2026
More
    HomeOpinionTelangana 3 Trillion Dollar Economy by 2047 : సీఎం రేవంత్ రెడ్డి కీలక...

    Telangana 3 Trillion Dollar Economy by 2047 : సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్పీల్, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

    📰 Generate e-Paper Clip

    Telangana 3 Trillion Dollar Economy by 2047 : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం సంపూర్ణ సహకారం అందించాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం నిర్దేశిం చుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనలో తెలంగాణ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయా లకు అతీతంగా దేశ భద్రత, జాతీ య ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయా లని పిలు పునిచ్చారు.హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిం చిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారు ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

    2047 నాటికి తెలంగాణకు 3ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

    ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన అభి వృద్ధి ప్రణాళికతో ముందుకు సాగు తోందన్నారు. స్వాతం త్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప నిచేస్తున్నామని వెల్లడించారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభు త్వం రా ష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరా రు. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి జోన్లుగా విభజించి రం గాల వారీగా లక్ష్యాలు నిర్దేశించినట్లు ముఖ్యమంత్రి వివ రించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సేవారంగం అభివృ ద్ధికి ప్రాధాన్యత, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు తయారీ, పారిశ్రా మిక రంగాల విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహ ద్దుల వరకు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం వారిగా ఈ మూడు జోన్లలో నిర్దేశించిన లక్ష్యాలను సా ధించాలంటే మెరుగైన రవాణా సదుపాయాలు, పటిష్ట మై న రహదారుల వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.

    రోడ్లతోనే పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ఊతం

    నగరాలు, గ్రామాలు, పారిశ్రామిక కారిడార్లను అనుసం ధాని స్తూ ఆధునిక రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవస రం ఉందని సీఎం తెలిపారు. మెరుగైన ర హదారుల వల్ల కనెక్టి విటీ, మొబిలిటీ పెరగడంతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యక లాపాలు వేగవం తమ వుతా యని చెప్పారు.తెలంగాణలో చే పట్టాల్సిన రహదారుల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కేం ద్రానికి పలు ప్రతి పాదనలు అందించామని గుర్తుచేశారు. వా టిపై సాను కూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకో వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

      వైద్య రంగంలోనూ భారీ మౌలిక సదుపాయాలు

    రహదారులతో పాటు ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల అ భివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. పురాతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని ఆధు నిక సదుపాయాలతో పునర్నిర్మి స్తున్నామని వెల్లడించారు. తె లంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆస్పత్రు లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు రాష్ట్రవ్యా ప్తంగా మొత్తం 8 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రుల నిర్మా ణం చేపడుతున్నట్లు వివరించారు.

    85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వ డం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వాములు కావాలని దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐ ఆర్‌సీ అధ్యక్షుడు లక్ష్మీకాంత పాది, సంస్థ కార్య వర్గ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికా రు లు, రహదారుల రంగ నిపుణులు పాల్గొన్నారు.

    ఐఆర్సీ సదస్సులో ప్రోటోకాల్ వివాదం

    హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ వేదికగా జరుగుతు న్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సులో ప్రోటోకాల్ వివా దం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. సదస్సు నిర్వ హణలో అధికారుల నిర్లక్ష్యంపై బీ జేపీ మెదక్ ఎంపీ రఘునం దన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్య క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సొంత కార్యక్ర మంలా ఇష్టాను సారంగా నిర్వహిస్తున్నారంటూ నిర్వాహకుల తీరును తప్పుబట్టారు.

    సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద, తగిన ఏర్పాట్లు కల్పించకపోవడంపై ఆయన తీవ్ర అస హనం వ్యక్తం చేశారు. ఎంపీలకు ప్రత్యేక లాంజ్ ఎక్క డుందని, తాము ఎక్క డ కూర్చోవాలని ప్రశ్నిస్తూ అధికా రులను నిలదీశారు. ఎంపీ లు కార్యక్రమానికి వస్తే కనీ సం ఆహ్వానించేవారు కూడా లేక పోవడం ఏమిటని ఆగ్ర హం వ్యక్తం చేశారు.

       కాంట్రాక్టర్ల కోసమే సదస్సా?

    కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నారా? ప్రజా ప్రతినిధులకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేరా? అతిథులకు సరైన ఏర్పాట్లు చేయలేనప్పుడు ఆహ్వా నించి అవమానించడం ఎం దుకంటూ నిర్వాహకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే ప్రోగ్రామ్ చీఫ్ సెక్ర టరీని పిలవాలని ఆదేశిస్తూ తన అసంతృ ప్తిని బహి రంగంగానే వ్యక్తం చేశారు.

    రవాణా శాఖ కార్యదర్శిపై విమర్శలు

    సదస్సు ఏర్పాట్లు, ప్రోటోకాల్ పర్యవేక్షణలో రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తి పూర్తిగా విఫలమయ్యారని రఘునందన్ రావు విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి సదస్సులో ఇలాంటి నిర్వహణ లోపాలు చోటుచేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు దారితీ సింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.