–ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి
–రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి
–శాలిగౌరారంలో ఎల్‌నినోపై అవగాహన సదస్సు 1,016 కొత్త పింఛన్లు మంజూరు
Bhongir MP Chamala Kiran Kumar Reddy : ప్రజా దీవె న, శాలిగౌరారం: పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కు మార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్త శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి పేద కుటుంబానికి సంక్షే మ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ సంకల్పమని తె లిపారు.శుక్రవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేం ద్రంలోని జీబీఎం ఫంక్షన్ హాల్లో ఎల్‌నినో పరిస్థితులు, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.
నీటి సంరక్షణే భవిష్యత్తుకు భరోసా
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఎంపీ సూచించారు. ప్రతి నీటి బొట్టును విలువైన వనరుగా భావించి సంరక్షించుకోవాలని, ఇంకుడు గుంతల ని ర్మాణం, వాననీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద వీలైనన్ని ఎక్కువ పను లు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణతో పాటు కూలీల కు ఉపాధి కల్పించాలని సూచించారు.రైతులు సంప్రదాయ పంటల సాగుతో పాటు పంట మార్పిడిపై దృష్టి సారించాలని, అధిక నీరు అవసర మయ్యే వరికి బదులుగా ఆరుతడి, తక్కు వ నీటితో పండే పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొ న్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఇటీవల ఇం దిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించార ని, చేయూత పింఛన్లను అర్హు లకు అందిస్తున్నారని తె లిపారు. ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరి స్తూ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకా లు చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శాలిగౌరారం మండలానికి 1,016 కొత్త పింఛన్లు
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితు ల నేపథ్యంలో నీటి వినియోగంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. నీరు వృథా కాకుండా ప్రతి గ్రామం లో వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ఇంకుడు గుంతలు నిర్మించుకో వాలని సూచించారు. రైతులు తక్కువ నీటితో పం డే పంటలు, స్వల్పకాలంలో చేతికి వచ్చే పంటల సాగుకు ప్రా ధాన్యత ఇవ్వాలని, రబీలో వరి సాగును తగ్గించేందుకు సహ కరించాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా శాలిగౌరారం మండలా నికి చేయూత పింఛన్ల కింద కొత్తగా 1,016 పింఛన్లు మంజూర య్యాయని, నవంబర్ 26 నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతా ల్లో నగదు జమ కానుందని వెల్లడించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కు టుంబం లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా అందిస్తుందని వివరించారు. జిల్లా లోని అర్హత కలిగిన కుటుంబాలన్నీ ఈ పథకాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు, ఆధార్ వివరాలతో పాటు కుటుం బంలో సంపాదించే వ్యక్తి, నామినీ, మొబైల్ నంబర్ వివరాల ను సరిగ్గా నమోదు చేయాలని కోరారు.
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలే అండ
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటి వినియో గంపై ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని అ న్నారు. గ్రామాల్లో ఇంకు డు గుంతలు, రైతుల పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించుకోవా ల ని సూచించారు. అధిక నీటి వినియోగం ఉండే వరికి ప్రత్యా మ్నాయంగా ఆరు తడి పంటలు సాగు చేయడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవచ్చని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తోం దని చెప్పారు. ఇం దిరమ్మ కుటుంబ జీవిత బీమా పథ కం మరో కీలక సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు. చేయూత పింఛన్ల కింద నెలకు రూ.2,016 అందిస్తు న్నామని, విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీ లు పెంచినట్లు తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద ఎక్కువ పను లు చేపట్టి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని అధి కారులను కోరారు.
.లబ్ధిదారులకు పింఛన్లు, చెక్కుల పంపిణీ
సదస్సు అనంతరం ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్యే మందుల సామే ల్ కలిసి లబ్ధి దారులకు చేయూత పింఛన్లు, కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి స హాయనిధి (సీఎంఆర్ఎఫ్) చె క్కులను అందజేశారు.ఈ కార్య క్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా కారు లు ప్రదర్శనల ద్వారా ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. కార్య క్రమానికి హాజరైన వారందరి తో నీటి సంరక్ష ణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి, డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి, అడిషనల్ పీడీ గంజి హరీష్ కుమార్, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరిగె నర్సింహా, మండల పార్టీ అధ్యక్షుడు చింత ధనంజయ్, తహసీల్దార్ కేతావత్ మాధవరావు, ఎంపీడీఓ భువనగిరి రమేష్, స్థానిక సర్పంచులు వంగూరి కవిత-వెంకన్న, శేఖర్ బాబు,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తోటకూరి పరశురామ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నెబోయిన సుధాకర్, కందాల సమరం రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు ఎల్ నివో ప్రభావం, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు తమ కళా ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. సదస్సు కు హాజరైన వారిచే నీటిని సంరక్షిస్థామని నకిరేకల్ క్లస్టర్ ఏపిడి గార్లపాటి జ్యోతి లక్ష్మి నీటి ప్రతిజ్ఞ చేయించారు.
Bhongir MP Chamala Kiran Kumar Reddy





