Homeనల్గొండNalgonda ITI student grandly felicitated by PM Modi : ప్రధాని మోదీ...

Nalgonda ITI student grandly felicitated by PM Modi : ప్రధాని మోదీ చేతుల మీదుగా నల్గొండ ఐటీఐ విద్యార్థినికి ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

— జాతీయ స్థాయిలో గంట రేణుక ప్రతిభకు అరుదైన గుర్తింపు
–ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో నేషనల్ టాపర్‌ గా నిలిచి తెలంగాణకు గర్వకారణం

Nalgonda ITI student grandly felicitated by PM Mo di :   ప్రజా దీవెన నల్లగొండ టౌన్: జాతీయ స్థాయిలో నల్గొం డ జిల్లా ప్రతిభ చాటుకుంది. ప్రభుత్వ ఐటీఐలో విద్యనభ్యసిం చిన గంట రేణుక తన అసాధారణ నైపుణ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి జి ల్లాకు గర్వకారణంగా నిలిచారు. జాతీ య స్థాయి నైపుణ్య పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏ కంగా నేషనల్ టాపర్‌గా నిలిచిన ఆమెకు ప్రధాన మంత్రి నరేం ద్ర మోదీ చేతుల మీదుగా ఘన సత్కారం లభించింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శనివారం నిర్వహించిన 5వ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో ఈ అరుదైన గౌర వం దక్కింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నిర్వహించిన 2026 ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో రేణుక అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆర్టి జన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్స్ (ఇంజినీ రింగ్ డిజైన్ టెక్నాలజీ) విభాగంలో దేశంలోనే ప్రథ మ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనతకు గు ర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు పురస్కారం అందించి అభినందించారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థిని జాతీ య స్థాయిలో అత్యున్నత ప్రతిభను చా టడం నల్గొండ జిల్లా కు గర్వకారణంగా నిలిచింది. రేణుక సాధించిన ఈ విజయం ఐటీఐ విద్యార్థుల కు స్ఫూర్తినివ్వడమే కాకుండా, సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధిస్తే జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని నిరూపించింది.

Nalgonda ITI student grandly felicitated by PM Modi

RELATED ARTICLES

Most Popular