HomeOpinionArrest of the accused in Thungathurthi Murder case: వెంపటి మహేష్ హత్య కేసులో...

Arrest of the accused in Thungathurthi Murder case: వెంపటి మహేష్ హత్య కేసులో పోలీసుల కీలక పురోగతి

📰 Generate e-Paper Clip

–ఎనిమిది మంది నిందితుల అరెస్టు, మరో నిందితురాలు పరారీ

:Arrest of the accused in Thungathurthi Murder case : ప్రజా దీవెన, తుంగతుర్తి:సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో కలకలం రేపిన సామకూరి మహే ష్ (25) హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించా రు. ఈ నెల 20న జ రిగిన దారుణ హత్యకు సంబంధించి ఎని మిది మంది నిందితు లను అరెస్టు చేశారు. మంగళవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌ లో డీ ఎస్పీ ప్రసన్నకుమార్ నింది తులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్ల డించారు.

గ్రామంలో పరువు పోయిందనే కక్షతో

డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో వెంపటి గ్రామానికి చెందిన సామకూరి మహేష్, అదే గ్రామానికి చెందిన రమణ బోయిన మహేష్ భా ర్య సుమలతతో అసభ్యం గా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణతో ఇ ద్దరి మధ్య గొడవ జ రిగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాట లో సుమలత తలకు గాయమైంది.ఈ విషయాన్ని రమణ బో యిన మ హేష్ తన తల్లిదండ్రులు, అత్తమామలు, బామ్మర్ది వే ణు, అన్న మురళి, వదిన హేమలతలకు తెలియజేశాడు. గ్రా మంలో తమ పరువు పోయిందనే కక్షతో సామ కూరి మహేష్‌ ను ఎలాగైనా హతమార్చాలని నిందితులు నిర్ణయించుకున్న ట్లు డీఎస్పీ తెలిపారు.

   ట్రాక్టర్‌ను అడ్డగించి కత్తితో దాడి

ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో సా మకూ రి మహేష్ తన ట్రాక్టర్‌పై వ్యవసాయ పొలానికి వెళ్తుండగా నిం దితులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. గ్రామ శివారులో ట్రాక్టర్‌ను అడ్డగించి, ముందుగా తెచ్చుకున్న కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని డీఎ స్పీ వివరించారు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్దిరాల పోలీస్ స్టేష న్ పరిధిలో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడిం చారు.

ఎనిమిది మంది అరెస్టు.. మరొకరు పరారీ

ఈ కేసులో రమణ బోయిన మహేష్, వల్లపు వేణు, రమణ బో యిన సుమలత, రమణ బోయిన మల్లయ్య, వల్లపు లింగ య్య, రమణ బోయిన మురళి, వల్లపు సోమలింగమ్మ తదిత రులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నింది తురాలు రమణ బోయిన హేమలత పరారీలో ఉందని, ఆమె కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.అరెస్టు చేసిన నింది తులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.ఈ మీడియా సమావేశంలో తుంగతుర్తి సీఐ ఉపేం దర్‌రావు, ఎస్సై క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Arrest of the accused in Thungathurthi Murder case

RELATED ARTICLES

Most Popular