HomeతెలంగాణACBreleased a majorreport exposing on Hyderabad NIMS : ఏసీబీ స్పష్టమైన...

ACBreleased a majorreport exposing on Hyderabad NIMS : ఏసీబీ స్పష్టమైన ప్రకటన, మాఅధికారులపై ఆరోపణలు నిజమైతే కఠినచర్యలు,నిమ్స్‌లో అవినీతిబాగోతంపై ఏసీబీ సంచలన నివేదిక

📰 Generate e-Paper Clip

–రూ.25 కోట్ల విలువైన ఇం ప్లాంట్లనిల్వల్లో అక్రమాలు

–క్యాంటీన్, ఉద్యోగ నియామకాలు, టెండర్లలోనూ ఉల్లంఘనలు

ACBreleased a majorreport exposing on Hyderab ad NIMS  ప్రజా దీవెన, హైదరాబాద్:అవినీతిపై యుద్ధం చే స్తున్న సంస్థలోనే అవినీతి జరిగితే సహించేది లేద ని తెలంగా ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్ప ష్టం చేసింది. త మ శాఖలో పనిచేసే అధికారులు సైతం చట్టానికి అతీ తులు కారని, ఎవరైనా అవి నీతి లేదా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించ బోమని తేల్చిచెప్పిం ది. ఇటీవల ఏసీబీ అధికారిపై మీడి యాలో వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నా మని ప్రక టించింది.అక్రమాస్తుల కేసులో ఏసీబీ కేసు న మో దు చేసిన ఓ వ్యక్తి, సంబంధిత అధికారిపై చేసిన ఆ రోపణలపై నిష్పక్షపాతంగా శాఖాపరమైన విచార ణ చేపట్టినట్లు వెల్లడించింది. అయితే మూడు సా ర్లు విచారణకు పిలిచినా ఫిర్యాదుదారుడు హాజ రుకాలేదని పేర్కొంది. ప్రస్తుతం విచారణ కొనసా గుతోందని, ఆరోపణలు నిజమని తేలితే సంబంధి త అధికారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుం టామని స్పష్టం చేసింది.అవినీతిని అరికట్టే సంస్థ ముందుగా తనలో తాను పారదర్శకత, నిజాయితీ, జవాబుదారీతనాన్ని పాటించాలని పేర్కొన్న ఏసీ బీ.. అంతర్గత అవినీతిపై జీరో టాలరెన్స్ విధా నా న్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. అధికారుల అక్రమాలపై ప్రజలు నిర్భ యంగా ఫిర్యాదు చేయా లని, ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గో ప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది.

  నిమ్స్‌లో ఏసీబీ మెరుపు దాడులు

హైదరాబాద్‌లోని నిజాంస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్ (నిమ్స్)లో ఏసీబీ నిర్వహించిన ఆకస్మి క తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వ చ్చాయి. 2026 అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో టీజీ సేఫ్ (ఫుడ్ సేఫ్టీ), డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖల ప్రత్యేక బృందాలతో కలిసి నిర్వహించిన తనిఖీలు ఆసుపత్రి వ్యవహారాల్లోని లో పాలను బయటపె ట్టాయి.ప్రాథమిక పరిశీలనలో ఉద్యోగుల నియామ కాల నుంచి క్యాంటీన్ నిర్వహణ వరకు, మెడికల్ షాపుల టెండర్ల నుంచి వైద్య పరికరాల నిల్వలు, బిల్లుల చెల్లింపుల వరకు పలు ఉల్లంఘనలు గు ర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఉద్యోగ నియామకాల్లో నిబంధనలకు తూట్లు

2019 నుంచి 2025 వరకు మానవ వనరుల సేవ లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తికాకుండా నే కార్యక లాపాలు కొనసాగినట్లు గుర్తించారు. కార్మికుల నియా మకాలు, సెమీ స్కిల్డ్ కేటగిరీకి మార్పుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడైంది. నియామకాల విష యంలో కుమ్మక్కు జరిగిన అనుమానాలు కూడా వ్యక్త మయ్యాయి.

   క్యాంటీన్‌లో అపరిశుభ్రత

నిమ్స్ ప్రధాన క్యాంటీన్‌లో అపరిశుభ్ర పరిస్థితులు, గ డువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తించారు. అవస రమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండానే క్యాం టీ న్ నిర్వహిస్తున్నట్లు తేలింది. టెండర్ల ప్రక్రియలో కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు బిడ్డర్ల మధ్య కుమ్మక్కు, పోటీ వ్యతిరేక విధానాలు అనుసరించినట్లు ప్రాథమి కంగా అనుమానించారు.

భద్రతా టెండర్లలోనూ అక్రమాలు

మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయాల రికార్డులు లేకపోవడంతో పాటు, రిజిస్ట్రేషన్ లేని కార్మికులను నియమించుకున్నట్లు గుర్తించారు. మరోవైపు భద్రతా సేవల టెండర్ల ఖరారులో అసాధా రణ జాప్యం, ఒప్పందాల గడువు పదేపదే పొడిగింపు లు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఏజెన్సీకి సంబంధించిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారెంటీని సైతం జప్తు చేయలేదని ఏసీబీ పేర్కొంది.

రూ.25 కోట్ల ఇంప్లాంట్లు,అనధికార నిల్వలు

ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన అంశంగా ఐదు ఆప రేషన్ థియేటర్లలో భారీ స్థాయిలో ఇంప్లాంట్లు, ఇతర వైద్య సామగ్రి నిల్వలను గుర్తించారు. సుమారు రూ.25 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, కన్సైన్‌మెంట్ వస్తువులను ఆపరేషన్ థియేటర్ల సమీపంలోని అల్మారాలు, సబ్‌స్టో ర్లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినట్లు వెల్లడిం చారు.వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రధాన స్టోర్‌కు సమా చారం ఇవ్వకుండానే నేరుగా విక్రేతల నుంచి ఇంప్లాంట్లు తీసు కుంటున్నట్లు గుర్తించారు. వాటిని వినియోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేసి, విక్రేతల ఇ న్వాయిస్‌లతో కలిపి ప్రధాన స్టోర్‌కు పంపి బిల్లులు ప్రా సెస్ చేస్తున్నట్లు ఏసీబీ తెలిపింది.ఈ విధానం వల్ల వాస్త వంగా వినియోగించని ఇంప్లాంట్లకు సైతం యుటిలిటీ స ర్టిఫికెట్లు జారీ చేసి, సరఫరాదారులతో కుమ్మక్కై బిల్లు లు పొందే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడ్డారు.

డిశ్చార్జ్ అయినా,బిల్లులు మాత్రం ఆతర్వాతే

బిల్లుల ప్రాసెసింగ్‌లోనూ తీవ్రమైన అవకతవకలు గు ర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగుల విషయంలో డిశ్చా ర్జ్ తర్వాత బిల్లులు ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించారు.జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత సుమారు రూ.2.66 కోట్ల విలువైన బిల్లింగ్ ఎంట్రీలు చేసినట్లు తనిఖీల్లో బయటపడింది.

  ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా

సర్జికల్ వినియోగ వస్తువుల వినియోగంలోనూ అసా ధారణ లెక్కలు నమోదైనట్లు ఏసీబీ గుర్తించింది. ఒకే రో గికి ఒక్క వారం లో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో నమో దు కావడం అనుమానాలకు తావిచ్చిం ది. ఈ తరహా అక్రమా ల్లో అధిక శాతం ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగు లకు సంబంధించినవేనని ప్రాథమికంగా గుర్తించారు.

     మరింత లోతుగా విచారణ

వెలుగులోకి వచ్చిన ఆరోపణలను మరింతగా ధ్రువీ కరించేందుకు ఏసీబీ అధికారులు నోట్‌ఫైళ్లు, ఒప్పంద పత్రాల ప్రతులు, ఇతర కీలక రికార్డులను తనిఖీల స మయంలో సేకరించారు. సంబంధిత శాఖల సహ కా రంతో తదుపరి పరిశీలన కొనసాగుతోంది.అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిన సంస్థగా ఏసీబీ తన విశ్వస నీయతను కాపాడుకోవడంతో పాటు, నిమ్స్‌లో వెలు గుచూసిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ ద్వారా బాధ్యులను గుర్తించడం ఇప్పుడు కీలకంగా మారింది.

విద్యుత్ డీఈ అంబేద్కర్ ఘాటు స్పందన

ఏసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆ శా ఖ ఇచ్చిన వివరణపై విద్యుత్ శాఖ డీఈ అంబే ద్కర్ తీవ్రంగా స్పందించారు. తాను చేసినవి కేవలం ఆరోపణలు కావని, లం చం డిమాండ్ చేసినట్లు స్పష్టంగా వెల్లడించే ఆడియో రికార్డిం గులతో పాటు అన్ని ఆధా రాలను అధికారుల ముందుంచా నని తెలిపారు.ఈనెల 17వ తేదీన విచారణకు రావాలని చె ప్పి, 19వ తేదీన సమాచారం ఇచ్చారని అంబేద్కర్ వెల్లడిం చారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

లంచం డిమాండ్ చేసినట్లు తెలిపే ఆడియో రికార్డిం గులను స్పష్టంగా చూపించినప్పటికీ, సంబంధిత అధికారులపై ముం దుగా కేసు నమోదు చేసి విచారణ ఎందుకు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ శాఖ అధికారులపై వచ్చిన ఆరోప ణల విషయంలో ఏసీబీ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోం దని ఆరోపించా రు.తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను నిరూ పించేందుకు సిద్ధంగా ఉన్నానని అంబేద్కర్ స్పష్టం చేశారు. ఆ డియో రికార్డింగులు సహా సమర్పించిన ఆధారాలపై ని ష్పక్ష పాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీ సుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఏసీబీ వివరణతో ఈ వివాదం ము గుస్తుందా? లేక అంబేద్కర్ సమ ర్పించిన ఆధా రాలపై తదు పరి విచారణకు అధికారులు ముందుకొస్తారా? అన్నది ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది.

ACBreleased a majorreport exposing on Hyderabad NIMS

RELATED ARTICLES

Most Popular