Friday, November 27, 2026
More
    HomePoliticsNalgonda Red Cross Services : నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ కీలక పిలుపు, రెడ్‌క్రాస్...

    Nalgonda Red Cross Services : నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ కీలక పిలుపు, రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి, ప్రజాసేవలో నూతన పాలకవర్గం చురుకైన పాత్ర పోషించాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda Red Cross Services : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజ సేవే లక్ష్యంగా ఇం డియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలు పునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పా లకవర్గ సభ్యులందరూ నిబద్ధతతో, సమష్టి కృషితో ప్ర జాసేవకు అంకితం కావాలని సూచించారు. మారు తు న్న కాలానికి అనుగుణంగా సామాజిక సమస్యలను గు ర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించా లని కోరారు.శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలోని ఉద యాదిత్య భవన్‌లో నిర్వహించిన జిల్లా ఇండియన్ రె డ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కా ర్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ, రెడ్‌క్రాస్ సంస్థకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయని పేర్కొన్నారు. సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా ఉండాలని, సభ్యులు నైతిక విలువలు, నియమ నిబం ధనలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.

    యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాలి

    యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విస్తృత అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జి ల్లాలో రక్తహీనత నిర్మూలనకు రెడ్‌క్రాస్ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా బాలికలు, గర్భిణులు, చిన్నా రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రక్త నిల్వల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ సేవలను మరింత బలోపేతం చేయాలని, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్త దా న శిబిరాలు, రక్తదాతల గుర్తింపు కార్యక్రమాలు చేపట్టా లని తెలిపారు.

    సోషల్ మీడియాను యువత పరిమితంగా, బాధ్యతా యుతంగా వినియోగించాలని, ఆన్‌లైన్ పరిచయాలు, స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. మాదకద్రవ్యాల సరఫరా లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్ లేదా పోలీసులకు సమాచారం అందించాల ని కోరారు. కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పా టు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాలకు సూచించారు.

    విదేశాల్లో ఉద్యోగాలకు భాషా నైపుణ్యాలు కీలకం

    నర్సింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, విద్యా ర్థులు జపనీస్, జర్మన్ భాషలను నేర్చుకుని తమ నై పుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్ర భుత్వ సహకారంతో డిసెంబర్ నెలలో విదేశీ భాషల శి క్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించా రు.

    పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

    సుస్థిర జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకో వా లని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు బదు లుగా వస్త్ర సంచులను ఉపయోగించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో సొంత వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం, వే డుకల్లో ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే తీసుకోవడం వంటి చిన్నచిన్న మార్పులతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు. పుస్తకా లను ఇతర విద్యార్థులకు అందించడం ద్వారా పున ర్వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.

    #l ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

    రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వర్షపాతం లోటు వంటి పరిస్థితులు ఎదు రయ్యే అవకాశాలున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇ వ్వాలని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగిం చాలని సూచించారు. విద్యార్థులు నీటి పొదుపుపై త మ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా అవగాహన కల్పించాలని కోరారు.

    సేవలను విస్తరించేందుకు కృషి చేస్తాం

    ఈ సందర్భంగా నూతన రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించేందుకు కృ షి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగు ణంగా ఆరోగ్య, రక్తదాన, సామాజిక సేవా కార్యక్రమా లను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ కా ర్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ శ్రీకాంత్, డాక్టర్ పుల్లారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంచుకొండ బిక్షమయ్య, కుంభం జ్యోతి రెడ్డి, నూతన పాలకవర్గ సభ్యులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాప కులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొ న్నా రు.ప్రజాసేవ, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ సంర క్షణ లక్ష్యాలుగా రెడ్‌క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న దిశగా నూతన పాలకవర్గం ముం దుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

    RELATED ARTICLES
    - Advertisment -

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.