HomeజాతీయంUnionCabinet Green Signal to Women Reservation, Delimitation Bills : బిగ్ బ్రేకింగ్, మహిళా...

UnionCabinet Green Signal to Women Reservation, Delimitation Bills : బిగ్ బ్రేకింగ్, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్, పార్లమెంటు లో కీలక చర్చకు రంగం సిద్ధం, 33 శాతం మహిళా కోటాకు ఆమోదం

📰 Generate e-Paper Clip

 

UnionCabinet Green Signal to Women Reservation ,Delimitation Bills : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజకీయ వ్యవస్థలో కీ లక మార్పులకు దారితీసే రెండు ముఖ్యమైన బి ల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్ర ధానమం త్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్‌ లో జరిగిన కేంద్ర కేబి నెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ని యోజకవర్గా ల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు గ్రీన్ సిగ్నల్ లభిం చింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసన సభల్లో మహిళ లకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ఆమో దం తెలిపింది. చట్టసభల్లో మహిళల ప్రాతి నిధ్యాన్ని పెంచడం తో పాటు రాజకీయాల్లో వారికి మరిన్ని అ వకాశాలు కల్పించ డమే ఈ నిర్ణయం లక్ష్యంగా పేర్కొంటున్నారు.

మరోవైపు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పు నర్విభజ న చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమో దం తెలిపింది. జనగణన తో సంబం ధం లేకుండా పునర్విభజ న ప్రక్రియ చేపట్టేలా బిల్లులోని విధివిధానాల్లో మార్పులు చేసి నట్లు సమాచారం.కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లులను త్వరలోనే పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చించను న్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈ అంశాలపై చర్చ మొదలైంది.

    విపక్షాల స్పందనపై ఉత్కంఠ

మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభు త్వ నిర్ణయాన్ని మహిళా సాధికారత దిశగా తీసుకున్న చర్యగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నా యి. అయితే డీలిమిటేషన్ ప్రక్రియతో రాష్ట్రాల మ ధ్య ప్రాతినిధ్యం, జనాభా ప్రాతిపదికన సీట్ల కేటా యింపు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు బిల్లులపై వి పక్ష పార్టీలు ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది ఇ ప్పుడు ఆసక్తికరంగా మారింది.

    ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చం ద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన కు సిద్ధమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ స మావేశం ముగిసిన అ నంతరం ఇద్దరు నేతలు హస్తినకు బయలుదేరనున్నారు. ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ ఆ హ్వానం మేరకు ఈ పర్యటన ఖరా రైనట్లు సమాచారం.

   ఎన్డీఏ సమావేశంపై అందరి దృష్టి

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు పార్ల మెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. శుక్ర వారం సా యంత్రం ఢిల్లీలో జరగ నున్న ఈ సమావేశంలో చంద్ర బాబు, పవన్ కల్యాణ్ పాల్గొన ను న్నారు.కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, వాటిపై మిత్ర పక్షాల అభిప్రాయాలు, పా ర్లమెంటులో అనుసరిం చాల్సిన వ్యూహం పై ఈ సమా వేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల చుట్టూ దేశ రాజ కీయాల్లో ఆ సక్తికర పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి. మొత్తానికి కేంద్ర మంత్రివర్గం కీలకమైన రెండు బిల్లులను ఆ మోదించడంతో దేశ వ్యాప్తంగా మరోమారు విస్తృత స్థాయిలో ప్రచారం ప్రారంభమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular