HomePoliticsDevarakonda Illicit Liquor Crackdown : దేవరకొండలో నాటు సారాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

Devarakonda Illicit Liquor Crackdown : దేవరకొండలో నాటు సారాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

–రెండు రోజుల మెరుపు దాడులు
–25 కేసులు నమోదు, 10 మంది అరెస్ట్

Devarakonda Illicit Liquor Crackdown : ప్రజా దీవెన, దేవరకొండ:నల్లగొండ జిల్లాలో అక్రమ నా టు సారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ భారీ స్థా యిలో ప్రత్యేక దాడులు నిర్వహించింది. దేవరకొండ ఎ క్సైజ్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సమన్వయ ఎన్ఫోర్స్మెం ట్ ఆపరేషన్‌లో అధికారులు అక్రమ నాటు సారా త యా రీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కమిషన ర్ హెచ్. హరికిరణ్, ఐఏఎస్, డైరెక్టర్ అవినాష్ మొహం తి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లగొం డ జిల్లా మద్య నిషేధ, ఆబకారీ అధికారి ఏ. కిషన్ పర్యవేక్ష ణలో ఈ ప్రత్యేక దాడులు జరిగాయి.

రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో అధికారు లు గణనీయమైన ఫలితాలు సాధించారు. మొత్తం 25 కేసులు నమోదు చేసి, 10 మందిని అరెస్టు చేశారు. 56 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోగా, అక్రమ త యారీకి ఉపయోగించే 4,500 లీటర్ల బెల్లం పులుసు (F J వాష్)ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. మరో 17 మందిని బైండోవర్ చేశారు.

ఐదు మండలాల్లో విస్తృత తనిఖీలు

నేరెడుగొమ్ము, చందంపేట, మల్లేపల్లి, దేవరకొండ, పీఏ పల్లి మండలాల్లోని పలు గ్రామాలు, తండాల్లో అధికారు లు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గువ్వలగు ట్ట, సేవాలాల్ తండా, జోడుభాయ్ తండా, చిట్రియాల, కాచరుపల్లి, పడమటి తండా, కంబాలపల్లి, పోగిళ్ల, మె గ్యా తండా, అంబోతు తండా, బాలాజీనగర్ తండా, పె ద్ద తండా, రేక్యా తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేప ట్టారు.

**బహుళ బృందాలతో సమన్వయ ఆపరేషన్**

ఈ ప్రత్యేక దాడుల్లో ఎస్టీఎఫ్ డీఎస్పీలు తిరుపతి యాదవ్, తుల శ్రీనివాసరావు, నల్లగొండ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ధన్వంత్ రెడ్డితో పాటు దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

**నాటు సారా నిర్మూలనే లక్ష్యం**

దాడుల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం లో అధికారులు మాట్లాడుతూ.. నాటు సారా తయారీ, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టడ మే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అక్రమ త యారీ కేంద్రాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక ఎ న్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.నాటు సారా వినియోగం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యే ప్ర మాదం ఉందని, ప్రజలు ఇటువంటి అక్రమ మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా నాటు సారా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తి స్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.అక్రమ నాటు సారా ర హిత సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కీలక మని ఎక్సైజ్ అధికారులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular