–రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? యువత భవిష్యత్తుతో చెలగాటమా?
–ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులే ప్రధాన అజెండా
— మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి
Brs mlc Election campaign in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధ మవుతూ గ్రంథాలయాల్లో రాత్రింబ వళ్లు శ్రమిస్తున్న నిరుద్యోగ యువత సమస్యలను కాం గ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏ నుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. యువతకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయ కుండా వారి భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడు తోందని ఆరోపించారు.నల్లగొండ పట్టణంలోని జిల్లా శాఖ గ్రం థాలయాన్ని కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్య లు, అభిప్రాయాలు, ఉద్యోగ సాధనలో ఎదురవుతున్న ఇబ్బం దులను అడిగి తెలు సుకున్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగ పడే కరెంట్ అ ఫైర్స్ పుస్తకాన్ని యువతకు అందజేశారు.ఈ సంద ర్భంగా గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు, స్కాలర్షిప్స్, ఫీజు రీయిం బర్స్మెంట్ తదితర అంశాలపై యువతతో చర్చించారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యా ర్థులు, నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించారని, స్వరాష్ట్రం ఏర్పడితే తమ కు ఉద్యోగ అవకాశాలు ల భి స్తాయని ఎన్నో ఆశలు పెట్టుకు న్నారని గుర్తుచేశారు. గ త బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వి ద్యారంగ అభివృ ద్ధికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి రావడానికి యూత్ డిక్లరేషన్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిస్థాయిలో అమ లు చేయడంలో వి ఫలమైందని విమర్శించారు. ఏళ్ల త రబడి పోటీ పరీక్షలకు సి ద్ధమవుతున్న యువత ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవా లని, వారి జీవితాలతో రాజకీయాలు చేయడం మానుకోవాల ని హితవు పలి కారు.గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు, డిజిటల్ లైబ్రరీలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుద్యోగ యువత కు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మా ట్లాడు తూ గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వి ద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమ స్యలపై తమ పో రాటం ఆగలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాల యాలు, స్టడీ సర్కిళ్లు, కోచింగ్ కేం ద్రాలు, విద్యాసంస్థలను సం దర్శిస్తూ యువత వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటు న్నా మని తెలిపారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దా దాపు మూడేళ్లు కావస్తున్నా రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏ మైందని, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎక్కడుందని ప్రశ్నిం చా రు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు భరోసా క ల్పించాల్సిన ప్రభుత్వం వారిని నిరాశకు గురిచేస్తోందని విమ ర్శించారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల్లో నిరుద్యోగ యువత సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా మారనున్నా యని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ, గ్రూప్స్, మెగా డీఎస్సీ, పోలీస్ ని యామకాలు, స్కాలర్షిప్స్, ఫీజు రీయింబ ర్స్మెంట్ అంశాలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని పేర్కొ న్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా? రెండు ఎమ్మెల్సీలు ఓడగొ ట్టాలా?” అనే నినాదం ప్రతి నిరుద్యోగ యువకుడి గొంతుక కా వాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే రా నున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత తమ ఓటు ద్వారా ప్రభు త్వానికి తగిన సమాధానం చెప్పాలని కోరారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుం దని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు భువనగిరి దే వేందర్, గోపగోని స్వాతి రాజశేఖర్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీ నివాస్ రెడ్డి, దండెంపల్లి సత్తన్న, జహంగీర్, సిరిగిరి సురేష్ రెడ్డి, వంటల అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
వాకర్లతో కంచర్ల భూపాల్ రెడ్డి, రాకేష్ రెడ్డి ముఖాముఖి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చే సింది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకే ష్ రెడ్డితో కలిసి గురువారం మేకల అభినవ్ స్టేడియం, ఎన్జీ కళాశాల పరిసరాల్లో వాకర్లను కలుసుకుని ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావంతు లు, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులతో నేరు గా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి సం పూర్ణ మద్దతు అందించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కంచర్ల భూపా ల్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఓ టమి ఎదురైనా నిరు ద్యోగ యువత సమస్యలపై నిరం తరం పోరాడుతూ వారికి అండగా నిలుస్తున్న నాయకు డు రాకేష్ రెడ్డి అని పేర్కొ న్నా రు. పట్టభద్రుల సమస్యల ను మండలిలో బలంగా వినిపిం చేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గెలుపు కోసం సమష్టి కృషి చేయాలి
అనంతరం 19వ డివిజన్లోని కోట్ల అశోక్ రెడ్డి నివాసం లో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో 1, 2, 18, 19 డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎ నుగుల రాకేష్ రెడ్డి మాట్లాడు తూ.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 30 నుంచి 40 శాతం వరకు పట్టభ ద్రుల ఓటరు నమోదు చేయించినట్లు తెలి పారు. మిగిలి న పట్టభద్రులను కూడా గుర్తించి ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు నమోదు చేయించడంతో పాటు, తన విజయానికి మద్ద తు కూడగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో చూపుతున్న చొరవ, ప్రతి కార్యక్రమాన్ని విజయ వంతం చే సేందుకు అందిస్తున్న సహకారం అభినంద నీయమని అన్నా రు. కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జు లు, మండల, గ్రామస్థాయి నాయకులు ఈ ఎన్నికను బాధ్యతగా తీసుకుని తన గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని కోరారు.
కేసీఆర్ విజయానికి నాంది కావాలి
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనుగుల రాకేష్ రెడ్డి గెలుపు భవిష్య త్తులో కేసీఆర్ విజయానికి నాంది కావాలని ఆకాంక్షించారు. ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త తమ శక్తి మేరకు కృషి చేసి రాకేష్ రెడ్డి విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చా రు. నల్ల గొండ నుంచి అత్యధిక మెజార్టీ సాధించేలా పార్టీ శ్రేణు లంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమా ల్లో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు పెరికే యాద య్య, గోపగోని స్వాతి రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీని వాస్ రెడ్డి, సూర మహేష్, చందు వంశీ, వింజమూరు లక్ష్మణ్, కోట్ల అశోక్ రెడ్డి, పెద్దులు తదితర పార్టీ నాయకులు, కార్యక ర్తలు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Brs mlc Election campaign in Nalgonda



