Homeనల్గొండMinister Komatireddy Venkat Reddy : ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ, రూ. 15 కోట్లతో...

Minister Komatireddy Venkat Reddy : ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ, రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం,మరో రూ .25 కోట్లు మంజూరుకు మంత్రి కోమటిరెడ్డి హామీ

📰 Generate e-Paper Clip

 

Minister Komatireddy Venkat Reddy  : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మం డలం లోని ప్రసిద్ధ ధర్వేశి పురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాల య అభివృద్ధికి ప్రభుత్వం భారీ కార్యాచర ణ చేపట్టింది. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగై న వసతులు కల్పిం చడంతో పాటు, ధర్వేశిపురా న్ని ప్రముఖ పర్యాటక, ఆ ధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు అడుగులు వేస్తోంది. ఆలయ అభివృద్ధి కి నిధుల వరద పారిస్తూ రహదారుల విస్తరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గురువారం ధర్వేశిపురం లో పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లు చేశా రు. పర్యాటక శాఖ నిధులు రూ.15 కోట్లతో నిర్మించ నున్న విశ్రాంతి గృహం, హరిత హోటల్, దేవాలయ సుంద రీక రణ పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న ఏడాదిలో ఆల యాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యా లు కల్పిస్తామని ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి త్వరలోనే మరో రూ.25 కోట్లు మంజూరు చేయించనున్నట్లు వెల్లడించా రు.

రూ.58 కోట్లతో రహదారుల అభివృద్ధి

నల్గొండ బైపాస్ నుంచి సాగర్ రోడ్డు మీదుగా మం చి నీళ్లబావి, ధర్వేశిపురం, చర్లగౌరారం వరకు సు మారు 10 కిలోమీటర్ల మే ర రూ.37 కోట్లతో చేపట్ట నున్న రహ దారి అభివృద్ధి పనులకు మంత్రి శంకు స్థాపన చేశారు. అలాగే మహబూబ్‌నగర్–నల్గొం డ రహదారి నుంచి మైలసముద్రం వరకు ఐదు కిలో మీటర్ల మేర రూ.21 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు కూడా శ్రీ కా రం చుట్టారు. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్వేశిపురం పరి సర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఇప్పటి కే రూ.1 30 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. ధర్వే శిపురం రోడ్డు విస్తరణ, డివైడర్లు, సెంట్ర ల్ లైటింగ్ వంటి పను లు పూర్తిచే శామని, రూ.67 కోట్ల తో ఆలయ రహదారితో పా టు గ్రామంలోని ఇతర రహ దారుల అభివృద్ధి పనులు చేపట్టి నట్లు వివరించారు.నల్గొండ నుంచి ధర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో రహదారి అభివృ ద్ధి పనులు చేపట్టామని, మెరుగైన రవాణా సౌక ర్యాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవ చ్చని మంత్రి పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలపై ప్రజలకు పిలుపు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలను అ మలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇ ళ్ల పంపిణీ కొనసాగు తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఇం దిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించా రు.ఇటీవల ప్రారంభించిన ఇందిర మ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రతి ఒక్క రూ నమోదు చేసుకోవాలని సూచించా రు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలకు బీమా సౌక ర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సా గుతోందని తెలిపారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్ల మ్మ దేవాలయ అభివృద్ధిలో భాగంగా రూ.15 కోట్లతో చేపట్ట నున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు, రూ. 37 కోట్లతో డ బుల్ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చు ట్టారని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథ కంలో అర్హులందరూ నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.ఈ కార్యక్రమంలో స్థా నిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ క రణ్ రెడ్డి, నల్గొండ ఆ ర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆల య చైర్మన్ వెంకటరెడ్డి, సర్పం చ్ రావుల శేఖర్, మార్కెట్ కమి టీ చైర్మన్, ప్రజాప్రతి నిధులు, ఆర్ అండ్ బి అధికారులు శ్రీధర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular