HomeOpinionGraduate Voters Draft List : బిగ్ బ్రేకింగ్, గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా విడుదల,12 లక్షలకు...

Graduate Voters Draft List : బిగ్ బ్రేకింగ్, గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా విడుదల,12 లక్షలకు పైగా దరఖాస్తులు, 80,635 దరఖాస్తుల తిర స్కరణ,రెండు పట్టభద్రుల నియోజకవర్గాల డ్రాఫ్ట్ ఓట రు జాబితా ప్రచురణ

📰 Generate e-Paper Clip

Graduate Voters Draft List : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు కీలక ముందడుగు వేశారు. మహబూబ్‌ నగర్– రంగా రె డ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓ టరు జాబితాలను (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్) ప్రచురించా రు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు భా రీగా దర ఖాస్తులు రావడం ప్రాధాన్యత సంతరించుకుం ది.

  మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ని యోజకవర్గ పరిధిలో మొత్తం 5,99,419 దరఖాస్తులు అందా యి. వీటిలో 5,68,105 దరఖాస్తులకు అధికా రులు ఆమోదం తెలిపారు. సరైన అర్హతలు, ఇతర కార ణాలతో 31,314 దర ఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 156 మండలాల పరిధి లో ఓటరు జాబితా ప్రక్రియను పూర్తి చేశారు.

వరంగల్–ఖమ్మం–నల్గొండలో భారీ స్పందన.

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవ ర్గం లో ఓటరు నమోదుకు 6,70,407 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6,21,086 దరఖాస్తులకు ఆమోదం లభిం చగా, 49,321 దర ఖాస్తులను తిరస్కరించారు. ఈ ని యోజకవర్గ పరిధిలోని 19 2 మండలాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు.

     రెండు నియోజకవర్గాల్లో కలిపి..

రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 12,69, 826 దరఖాస్తులు అందగా, 11,89,191 ద ర ఖాస్తులకు ఆ మోదం లభించింది. మరో 80,635 దర ఖాస్తులను అధికారు లు తిరస్కరించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణతో తదు పరి ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular