Graduate Voters Draft List : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు కీలక ముందడుగు వేశారు. మహబూబ్నగర్– రంగా రె డ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రు ల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓ టరు జాబితాలను (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్) ప్రచురించా రు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు భా రీగా దరఖాస్తులు రావడం ప్రాధాన్యత సంతరించుకుం ది.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యు యే ట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,99,419 దరఖాస్తు లు అందాయి. వీటిలో 5,68,105 దరఖాస్తులకు అధికా రులు ఆమోదం తెలిపారు. సరైన అర్హతలు, ఇతర కార ణాలతో 31,314 దరఖాస్తులను తిరస్కరించారు. మొ త్తం 156 మండలాల పరిధిలో ఓటరు జాబితా ప్రక్రియ ను పూర్తి చేశారు.
వరంగల్–ఖమ్మం–నల్గొండలో భారీ స్పందన.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవ ర్గం లో ఓటరు నమోదుకు 6,70,407 దరఖాస్తులు వచ్చా యి. వీటిలో 6,21,086 దరఖాస్తులకు ఆమోదం లభిం చగా, 49,321 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ ని యోజకవర్గ పరిధిలోని 192 మండలాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు.
రెండు నియోజకవర్గాల్లో కలిపి..
రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 12,69,826 దరఖాస్తులు అందగా, 11,89,191 ద ర ఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 80,635 దర ఖాస్తులను అధికారులు తిరస్కరించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

