HomeIndiaUnion Cabinet Key Decisions : బిగ్ బ్రేకింగ్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, భారీ...

Union Cabinet Key Decisions : బిగ్ బ్రేకింగ్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

📰 Generate e-Paper Clip

–రూ.11 వేల కోట్లతో నిర్మాణ, మౌలిక సదుపాయాల పరిక రాల తయారీ ఎకోసిస్టమ్‌కు ఆమోదం

–తమిళనాడు, అసోంకు కీలక ప్రాజెక్టులు

Union Cabinet Key Decisions : ప్రజా దీవెన,న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు మౌలిక సదు పాయాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్మాణ, మౌలిక సదుపా యాల పరికరాల తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రత్యేక ఎకోసిస్టమ్ పథకానికి ఆమోదం తెలిపింది.ఈ పథకం ద్వారా దేశీయంగా నిర్మాణ పరికరాల త యా రీని ప్రోత్సహించడంతో పాటు పరిశ్రమలకు అవసర మైన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెం చేందుకు అవకాశం కలగనుంది.

  తమిళనాడులో మరో కంటైనర్ టర్మినల్

తమిళనాడులోని కామరాజర్ పోర్టు అభివృద్ధికి కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.4,288 కోట్ల వ్యయంతో రెం డో కంటైనర్ టర్మినల్ ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో పోర్టు సామర్థ్యం పెర గడంతో పాటు సముద్ర వాణి జ్యానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.

   అసోంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్

ఈశాన్య రాష్ట్రాల విమానయాన మౌలిక సదుపాయాల అభి వృద్ధిపైనా కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అసోం లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పా టుకు కేబినెట్ ఆమో దం తెలిపింది.మొత్తంగా పారి శ్రామిక తయారీ, పోర్టు ఆధునికీ కరణ, విమానయాన రంగాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర కేబినె ట్ తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ మౌలిక సదుపాయాల రంగం లో కీలక ముందడుగుగా నిలవనున్నాయి.

Union Cabinet Key Decisions

RELATED ARTICLES

Most Popular