Saturday, November 28, 2026
More
    HomeOpinionNalgonda Drinking Water Infrastructure : నల్లగొండ అభివృద్ధికి మరో భారీ నిధుల వరం,తాగు నీటి...

    Nalgonda Drinking Water Infrastructure : నల్లగొండ అభివృద్ధికి మరో భారీ నిధుల వరం,తాగు నీటి మౌలిక సదుపాయాల విస్తరణకు కీలక అడుగు

    📰 Generate e-Paper Clip

    –మిషన్ భగీరథకు రూ.43.04 కోట్లు మంజూరు
    –101 గ్రామాలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు

    Nalgonda Drinking Water Infrastructure : ప్రజా దీవెన, నల్లగొండ: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తాగునీటి మౌలిక సదు పాయాల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటా యించింది.మిషన్ భగీరథ పథకం కింద నల్లగొండ ని యో జకవర్గ పరిధిలోని 101 గ్రామాల్లో ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వా యర్లు (ఓహెచ్ఎస్ఆర్), పైప్‌లైన్ల నిర్మా ణానికి రూ.43.04 కో ట్ల నిధులను ప్రభుత్వం మంజూ రు చేసింది. ఈ మేరకు పం చాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ జీవో నంబర్ 627ను జారీ చేసింది.

       నాలుగు మండలాల్లో అభివృద్ధి పనులు

    నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల పరి ధిలోని 101 గ్రామాల్లో ఈ నిర్మాణ పనులు చేపట్ట నున్నారు. నూతన రిజర్వాయర్లు, పైప్‌లైన్ల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రజ లకు నిరంతరాయంగా, మెరు గైన తాగునీటి సౌకర్యాలు అం దించేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి.

    గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాలే లక్ష్యం

    గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య త నిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందు కు సాగుతోంది. రూ.43.04 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులు పూర్తయితే 101 గ్రామాల ప్రజలకు తాగునీటి సౌకర్యాల పరంగా ప్రయో జనం చేకూరనుంది.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయ క త్వంలో నల్లగొండ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల క ల్పనకు సంబంధించిన ఈ నిధుల మంజూరు గ్రామీణ తాగునీ టి వ్యవస్థ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది.

    Nalgonda Drinking Water Infrastructure

    RELATED ARTICLES
    - Advertisment -

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.