Disappointing response from bidders to the HMDA land auction : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యం త విలువైన భూముల విక్రయానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HM D A) చేపట్టిన ఈ- వే లానికి ఆశించిన స్పందన ల భిం చలేదు. భారీ ధరలకు భూ ములను విక్రయించాల న్న అధికారుల ప్రయత్నానికి బిడ్డర్ల నుంచి నిరాశ ఎదురైంది. మూసాపేట, కోకాపేట నియోపొలిస్ ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంలో ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం చర్చనీయాం శం గా మారింది.రెండు విడతల్లో ఈ-వేలం నిర్వహించి నప్పటికీ కొనుగోలుదారుల నుంచి ఎలాంటి ఆసక్తి వ్యక్తం కాలేదు. దీంతో వేలం ప్రక్రియను HMDA ర ద్దు చేయాల్సివచ్చింది.
ఎకరాకు రూ.120 కోట్ల వరకు ధరలు
మూసాపేట ట్రక్ పార్క్ పరిధిలోని 3.15 ఎకరాల భూ మిని, కోకాపేట నియోపొలిస్‌లోని 4.59 ఎక రాల భూ మిని వేలం వేయాలని HMDA నిర్ణయిం చింది. ఇందు లో మూసాపేట భూములకు ఎకరా కు కనీస ధర రూ.9 9 కోట్లు, కోకాపేట నియోపొ లిస్ భూములకు ఎకరాకు రూ.120 కోట్లుగా నిర్ణ యించింది.అయితే ఈ భారీ కనీ స ధరల నేప థ్యంలోనో, ఇతర మార్కెట్ పరిస్థితుల కా రణం గానో బిడ్డర్లు వేలంలో పాల్గొనకపోవడం గమనా ర్హం.
వరుసగా వాయిదాలు.. వేలంపై ప్రశ్నలు
ఇటీవల జూబ్లీహిల్స్‌లోని హుడా హైట్స్ భూముల ఈ- వేలా న్ని కూడా HMDA వాయిదా వేసింది. తా జాగా మూసాపేట, కోకాపేట భూముల వేలానికి కూడా స్పందన లేకపోవడంతో HMDA భూముల విక్రయాలపై కొత్త చర్చ మొదలైంది.


