Nalgonda Red Cross Society OathTaking Ceremo ny : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజ సేవే లక్ష్యంగా ఇం డియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృ తం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీక రించిన పాలకవర్గ సభ్యులంద రూ నిబద్ధతతో, సమష్టి కృషితో ప్ర జాసేవకు అంకితం కావాల ని సూచించారు. మారుతున్న కా లానికి అనుగుణంగా సామా జిక సమస్యలను గు ర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు. శుక్రవా రం కలెక్టరేట్ ఆవరణలోని ఉద యాదిత్య భవన్లో నిర్వహిం చిన జిల్లా ఇండియన్ రె డ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గ ప్ర మాణ స్వీకార కార్యక్రమా నికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. నూతన పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలి యజేస్తూ, రెడ్‌క్రాస్ సంస్థకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయని పే ర్కొన్నారు. సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా ఉండాలని, సభ్యులు నైతిక విలువలు, నియ మ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.
యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాలి
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రక్తహీనత నిర్మూలనకు రెడ్‌క్రాస్ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా బాలికలు, గర్భిణులు, చిన్నా రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రక్త నిల్వల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ సేవలను మరింత బలోపేతం చేయాలని, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్త దా న శిబిరాలు, రక్తదాతల గుర్తింపు కార్యక్రమాలు చేపట్టా లని తెలిపారు.
సోషల్ మీడియాను యువత పరిమితంగా, బాధ్యతా యుతం గా వినియోగించాలని, ఆన్లైన్ పరిచయాలు, స్నేహాల విష యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్ర వ్యాల సరఫరా లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్ లేదా పోలీసులకు సమాచారం అందించాల ని కోరారు. కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పా టు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్క రించాలని యాజమాన్యాలకు సూచించారు.
విదేశాల్లో ఉద్యోగాలకు భాషా నైపుణ్యాలు కీలకం
నర్సింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ రంగంలో మంచి ఉద్యోగావకాశా లు ఉన్నాయని, విద్యా ర్థులు జపనీస్, జర్మన్ భాషలను నేర్చు కుని తమ నై పుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించా రు. ప్రభుత్వ సహకారంతో డిసెంబర్ నెలలో విదేశీ భాషల శి క్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సుస్థిర జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలె క్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సం చులను ఉపయోగించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూ రంగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో సొంత వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం, వే డుకల్లో ఆహారాన్ని వృథా చేయకుం డా అవసరమైనంత మాత్రమే తీసుకోవడం వంటి చిన్నచిన్న మార్పులతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు. పు స్తకాలను ఇతర విద్యార్థులకు అందించడం ద్వారా పునర్విని యోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పు లు, వర్షపాతం లోటు వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశా లు న్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీటి సంరక్ష ణకు అత్యంత ప్రాధాన్యత ఇ వ్వాలని, ప్రతి నీటి బొట్టును పొ దుపుగా వినియోగిం చాలని సూచించారు. విద్యార్థులు నీటి పొదుపుపై త మ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా అవ గాహన కల్పించాలని కోరారు.
సేవలను విస్తరించేందుకు కృషి చేస్తాం
ఈ సందర్భంగా నూతన రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ హేమల త మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొ సై టీ సేవలను మరింత విస్తరించేందుకు కృ షి చేస్తామని తెలిపా రు. ప్రజల అవసరాలకు అనుగు ణంగా ఆరోగ్య, రక్తదాన, సా మాజిక సేవా కార్యక్రమా లను ముందుకు తీసుకెళ్తామని పే ర్కొన్నారు.ఈ కా ర్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ శ్రీకాంత్, డాక్టర్ పుల్లారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంచు కొండ బిక్షమయ్య, కుంభం జ్యోతి రెడ్డి, నూతన పాలకవర్గ స భ్యులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాప కులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ప్రజాసేవ, ఆరోగ్య పరిర క్షణ, పర్యావరణ సంరక్షణ లక్ష్యాలుగా రెడ్‌క్రాస్ సేవలను ప్రజ లకు మరింత చేరువ చేయాలన్న దిశగా నూతన పాలకవర్గం ముం దుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Nalgonda Red Cross Society OathTaking Ceremony



