Sunday, September 27, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి వ్యవసా యాధికారి చెంపచెల్లుమనిపించిన మహిళా ఉద్యోగి, అసభ్యంగా...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి వ్యవసా యాధికారి చెంపచెల్లుమనిపించిన మహిళా ఉద్యోగి, అసభ్యంగా ప్రవ ర్తించాడని ఆరోపణలు

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం సంచలన సంఘటన చోటుచేసు కుంది. తనపట్ల అసభ్యంగా ప్రవ ర్తించాడంటూ మహిళా ఉద్యోగి మండల వ్యవసాయ అధికారి చెంప చెల్లుమనిపించిన ఘటన సం చలనం సృష్టించింది. పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి. తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ ఏఈవోను నియోజక వర్గ పరిధిలోని తుంగతుర్తితో పాటు మరో మండల ఏఓలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారoటూ ఆరోపిస్తున్న సదరు మహిళా ఏఈవో కార్యాల యంలోనే ఏవో పై దాడి చేయడమే కాకుండా ఆవేశంతో ఊగిపోతూ బూతుపురాణం అందుకున్నారు.

    ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ కా ర్యాలయంలో అధికారుల సమక్షం లో ఏవో పై దాడికి దిగిన సదరు మహిళ ఏఈఓ తనను వేధించిన ట్లు ఆరోపించడమే కాక వారిపై కఠి న చర్యలు తీసుకోవాలని ఆ త ర్వా త మీడియాతో గోడు వెళ్ళబోసుకు న్నారు. తాను గత కొంతకాలంగా వీ రితో ఇబ్బంది పడుతున్నానని వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. ఈ విషయం దావ నoలా వ్యాపించడంతో తీవ్రచర్చనీ అంశంగా మారింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.