Monday, September 28, 2026
More
    HomePoliticsTelangana MLA : బిగ్ బ్రేకింగ్, తుదిదశకు తెలంగాణ ఎమ్మెల్యేల వివరణలు, అసెంబ్లీ కార్యదర్శి కీలక...

    Telangana MLA : బిగ్ బ్రేకింగ్, తుదిదశకు తెలంగాణ ఎమ్మెల్యేల వివరణలు, అసెంబ్లీ కార్యదర్శి కీలక నిర్ణయం

    📰 Generate e-Paper Clip

    Telangana MLA : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అం శం మరోసారి తెరమీదకొచ్చింది. పా ర్టీ మారిన బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మె ల్యేల విషయంలో తాజాగా కొత్త ప రిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్‌కు 8 మంది ఎమ్మెల్యేలు త మ వివరణలు సమర్పించారు. తా ము ఇప్పటికీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే నని, పార్టీ మారలేదని లేఖల్లో స్ప ష్టంచేసిన విషయం విదితమే.

    అయితే సీఎంను నియోజకవర్గ అ భివృద్ధి కోసమే కలిశామని, ఆయ న వేసింది కాంగ్రెస్‌ కండువా కాదని జెండా కండువా మాత్రమేనని వివర ణ ఇవ్వడం గమనార్హం. అందుకు సంబంధించిన ఫొటోలు, వేతన ర సీదులు, ఇతర ఆధారాలను కూడా తమ లేఖలతో జత చేశారు.

    ఇదిలా ఉండగా పీఏసీ చైర్మన్‌ పద వి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సం ప్రదాయమని అరికెపూడి గాంధీ లే ఖలో వివరించారు. ఇక ఎమ్మెల్యేల ను వేర్వేరుగా విచారించాలని స్పీ క ర్‌ నిర్ణయించారు. ఇరుపక్షాల వాద నలు విన్న తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది.

    ఇక దానం నాగేందర్‌, కడియం శ్రీహ రి వివరణ ఇచ్చేందుకు అదనపు స మయం కోరగా, మిగతా 8 మంది ఇప్పటికే తమ సమాధానాలు సమ ర్పించినట్లు అసెంబ్లీ వర్గాలు తెలి పాయి.

    బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై వివరణల ప్రక్రియ వేగం అందుకుంది. ఎమ్మె ల్యేల నుండి వచ్చిన వివరణలను అసెంబ్లీ కార్యదర్శి సంబంధిత బీఆ ర్ఎస్‌ నేతలకు పంపించారు. కృష్ణ మోహన్‌ వివరణను పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌గౌ డ్‌ వివరణలను కల్వకుంట సంజ య్‌కి, పోచారం, సంజయ్‌ల వివర ణలను జగదీష్‌రెడ్డికి, కాలె యాద య్యకు, గూడెం మహిపాల్‌రెడ్డి వివ రణలను చింతా ప్రభాకర్‌కి, తెల్లం వెంకట్రావు వివరణను వివేకా నం ద్‌గౌడ్‌కి పంపారు.

    రాబోయే మూడ్రోజుల్లో అభిప్రాయం ఇవ్వాల ని అసెంబ్లీ కార్యదర్శి ఆదే శాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆ దేశాల కారణంగా సమయం పొడి గింపు ఉండదని స్పష్టంచేశారు. ఇ రుపక్షాల వాదనలు విన్న తర్వాతే స్పీకర్‌ తుది నిర్ణయం వెలువరించ నున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.