–ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్ర వైట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తాం
–మారు మూల ప్రాంతంలో మేఘా జాబ్ మేళా నిర్వహించడం ఇదే ప్ర ప్రధమం
–జాబ్ మేళాకు నిరుద్యోగుల నుం డి భారీ స్పందన, 40 వేల పైచిలు కు అభ్యర్థుల నమోదు
–ఎస్.సి,ఎస్.టి,బి.సి,ఇ.బి.సి నిరు పేదలందరి కళ్ళలో వెలుగులు నిం పడమే తమముందున్న కర్తవ్యం
— పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
N. Uttam Kumar Reddy : ప్రజా దీవెన హుజూర్ నగర్: నిరుద్యోగులకు ఉపాధి కల్పనకై కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంక ల్పంతో ఉందని రాష్ట్ర నీటిపారు దల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పే ర్కొన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రవైట్ రంగంలోనూ ఉపాధి కల్పించేందుకే ఈ మేఘా జాబ్ మే ళా నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగం గా నే ముందెన్నడూ లేని రీతిలో ప్రప్రథ మంగా మారు మూల ప్రాంతం హు జుర్నగర్ లో మేఘా జాబ్ మేళా ని ర్వహిస్తున్నా మని ఆయన తెలిపా రు.
పరిశ్రమల శాఖాకు అనుబంధంగా ఉన్న డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణా, సింగరేణి కాలరీస్ సహకారంతో మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మేఘా జాబ్ మేళా కార్య క్రమాన్ని హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఉదయంరాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి ప్రారంభించారు.
శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్,శాసనసభ్యులు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి,డి.ఐ. జి ఎల్.ఎస్ చౌహన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్.పి నర సిం హా, నల్గొండ ఎస్.పి శరత్ చంద్ర ప వార్, ఖమ్మం కమిషనర్ సునీల్ ద త్ లతో పాటుDEET డైరెక్టర్ రా జే శ్వర్ రెడ్డి, అడిషనల్ కార్పొరేట్ రిలే షన్ డైరెక్టర్ వంశీదర్ రెడ్డి, సింగ రే ణి కాలరీస్ ప్రతినిధి చంద్ర తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు.
అనంతరం జరిగిన మీడియా సమా వేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజుర్నగర్ లో నిర్వహిస్తున్న మేఘా జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు తరలి రాగా అదే స్థాయిలో 275 పరిశ్ర మలు ఉద్యోగ నియామకాల ప్రక్రి య చేపట్టేందుకు తరలి రావడం శుభపరిణామమని ఆయన అభివ ర్ణించారు.జాబ్ మేళాలో పాల్గొనేం దుకు 40 వేల పై చిలుకు అభ్యర్థు లు తమ తమ పేర్లు నమోదు చేసు కోవడంతో పెరిగిన సంఖ్యను దృ ష్టిలో పెట్టుకొని రెండో రోజుకు కొన సాగిస్తున్నట్లు ఆయన వెల్లడించా రు.
అందుకు గాను అల్పాహారం మొ దలు బోజనాది సౌకార్యాలను ఏ ర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.పేర్లు నమోదు చేసుకున్న ప్రతిబొక్కరికి ఆయా కంపెనీలు ని ర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనేం దుకు వెసులుబాటుగా ఉంటుంద న్న కోణంలొనే రెండో రోజుకు పొడి గించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
సమాజానికి సవాల్ గా మారిన ని రుద్యోగ సమస్య నిర్ములనకు కాం గ్రె స్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన 20 నెలల వ్య వధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సారధ్యంలోని రాష్ట్ర ప్ర భుత్వం ప్రభుత్వ రంగంలో 70 వేల నుండి 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు. తాజాగా గ్రూప్-1,గ్రూప్-2 ఉద్యో గాల భర్తీ కుడా అందులో భాగమే నన్నారు.
పట్టణ ప్రాంత యువతకు సరిస మానంగా గ్రామీణ ప్రాంత యువ తీ,యువకులకు ఉపాధి అవకాశా లు కల్పించాలన్న దృఢ సంకల్పం తోటే మేఘా జాబ్ మేళా కార్యక్ర మాన్ని మారుమూల ప్రాంతం అ యిన హుజుర్నగర్ లో నిర్వహిస్తు న్నామని ఆయన చెప్పారు.గోండు గూడెంలో దళిత వాడల్లో బి సి బస్తీ ల్లో ఉన్న నిరుపేదలతో పాటు మైనా రిటీ ఇ. బి.సి ల కళ్ళలో వెలుగులు నింపాలి అన్న సదుద్దేశంతోటే ఎన్ని వ్యయప్రయాసాలు ఎదురైనా మొ క్కవోని ధైర్యంతో ఈ మేఘా జాబ్ మేళా కార్యక్రమానికి అంకురార్పణ చుట్టామన్నారు.
స్థానిక పరిశ్రమలతో పాటు జాతీ య అంతర్జాతీయ స్థాయి పరిశ్రమ లతో తానే స్వయంగా సంప్రదించి జాబ్ మేళాలో పాల్గొనేందుకు అంగీ కరింప చేశామన్నారు.అర్హులైన వా రందరిని ఎంపిక చేయడం తో పా టు జాబ్ మేళా లో హాజరైన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఆ యా కంపెనీలకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉ పాధి కల్పించేందుకు గాను ప్రస్తుతం ఏర్పాటు చేసిన మేఘా జాబ్ మేళా మొదటి అడుగు మాత్రమే నని, అ నుకున్న ఫలితాలు సాధిస్తే మరోసా రి కోదాడ కేంద్రంగా మరో మేఘా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ఆ యన ప్రకటించారు.అయితే ఈ జా బ్ మేళా అనుభవాలను పూర్తి స్థా యిలో సమీక్షించుకుని మరింత పురోగతిని సాదించేందుకు ప్రణా ళికా బద్దంగా ముందుకు పోతామ న్నారు.
మారుమూల ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు సు దూర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల లో ఉపాధి అవకాశాలు పొందలేక పోతున్న అంశం నా సుదీర్ఘ రాజకీ య అనుభవంతో పరిశీలించిన మీ దటనే ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశా లు కల్పించేందుకే మేఘా జాబ్ మే ళా కార్యాక్రమానికి శ్రీకారం చుట్టామ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మ రో మారు పునరుద్ఘాటించారు.



