Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో హ్యామ్ విధానంలో రాష్ట్ర ప్రభు త్వం చేపట్టబోయే రోడ్లలో రూ. 8వే ల కోట్ల స్కాం జరుగుతుందని మా జీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరో పణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి తన దైనశై లిలో సమాధానమిస్తూ హాట్ కా మెంట్స్ చేశారు.ఇటీవల బిఆర్ఎస్ నేతల ప్రెస్టేషన్ మాటలు వింటుంటే జాలేస్తుందన్నారు. గతంలో రోడ్లు వేయాలంటే మనసు రాలేదు కాని ఇప్పుడు అద్దంలాంటి రోడ్లు వేస్తా మంటే బిఆర్ఎస్ వాళ్ల గుండెలు అ దురుతున్నాయన్నారు. పచ్చకామె ర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపి స్తుందన్నట్లు అన్నిట్లో స్కాంలు చే సి న మీకు ఏది చూసిన స్కామే కన్పి స్తుందనీ ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం స్కాం,యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం స్కాం,ధరణి స్కాం, గొర్రెల స్కాం ఇలా చెప్పుకుంటూ పో తే పదేళ్ల కాలంలో మీరు చేసిన స్కాంలకు అంతే లేదని మండిపడ్డా రు. కవిత వేరే కుంపటి పెట్టుకుంద ని, ఇవాళ్టి నుండి జనాల్లోకి అంటూ వెళ్తున్నది..మరోవైపు హరీష్ రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నట్లు తెలు స్తోంది అని మంత్రి అన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుండడం, ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు,పుట్టకొక్కరు అవడం చూసి చోటా మోటా బిఆర్ఎస్ నేత లు అయోమయంలో పడి ఆగం ఆగం అవుతున్నారనీ విమర్శించా రు.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగ తంగా నాకు మంచి మిత్రుడే కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాట లు చూస్తుంటే ఇంత అజ్ఞానా, అని విచారం వ్యక్తం చేస్తున్న అని అన్నా రు. CRIF రోడ్లకు, హ్యామ్ రోడ్ల వి ధానికి చాలా తేడా ఉంటుంది, R& B శాఖ మంత్రిగా పనిచేసిన ఆయ నకు ఇది తెలియకపోవడం బాధాక రమన్నారు. CRIF లో కి. మీ1.75 కోట్లు అవుతుందన్నది సింపుల్ వైడె నింగ్ కోసం మాత్రమే,అదే హ్యామ్ మోడల్ లో చేస్తున్నది డబుల్ లేన్ బలోపేతం అది కూడా NHAI నా ర్మ్స్ ప్రకారం చేస్తున్నాం. కి.మీ రోడ్డు మెయింటెనెన్స్ కోసం 2కోట్లు అద నంగా ఖర్చు చేస్తున్నారు. ఒక్క కి. మీ రోడ్డు కోసం 6 కోట్లు అవుతుం దని అసత్యాలు మాట్లాడాడని, ని జానికి 15 సంవత్సరాల్లో ఒక్క కి. మీ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చే సేది కేవలం 20లక్షల లోపే..మొత్తం ఒక్క కి.మీ మీద మొత్తం కాలానికి 2కోట్ల90లక్షలు మాత్రమే అవుతుం దని వివరించారు.
కళ్ళద్దాలు పెట్టుకొని కూడా 0.4% ను 4% అని చదివావంటే నీ ఆరో గ్యం పై నాకు ఆందోళన కలుగుతుం ది మిత్రమా అని మంత్రి తన స్టైల్ సె టైర్ వేశారు.మెయింటెనెన్స్ కోసం మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏ మి ఖర్చు చేయదనీ..రెండో సం వ త్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు 0.4% మాత్రమే చేస్తుం దని ,6వ సంవత్సరంలో 0.8%,7వ సం వత్సరంలో రోడ్ రెన్యువల్ కు 2. 4%, తర్వాత 8 నుండి 12 సంవ త్సరాల వరకు 0.4% శాతం,13 నుండి 0.8%శాతం అని ఇలా మొ త్తం 15 సంవత్సరాల్లో మెయింటె నెన్స్ కోసం అయ్యే ఖర్చు కేవలం 20 లక్షల లోపే అని మంత్రి స్పష్టం చేశారు.
మొబైలైజేషన్ అడ్వాన్స్ అని ప్రజ ల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం రూ పొందించిన హ్యామ్ మోడల్ నిబం ధనల ప్రకారం ఇంట్రెస్ట్ తో కూడిన మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ని ర్మాణ సమయంలోనే వడ్డీతో సహా సంబంధిత నిర్మాణ సంస్థ బిల్లుల నుండే రికవరీ చేస్తామని మంత్రి తెలిపారు.ఈ హ్యామ్ విధానం తె లంగాణలో కొత్తగా తెచ్చింది కాదు ఇది వరకే కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్ల నుండి అమలవుతుంది అట్లాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థా న్,ఉత్తర ప్రదేశ్,తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గత ఐదేళ్లుగా అమలులో ఉందిని తెలిపారు.ఈ టెండర్లలో చి న్న కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అని ఇది వరకే నేను పిలుపునిచ్చాను. మీరు ఎగ్గొట్టి పోయిన బకాయిలు మేము చెల్లిస్తున్నాం. చిన్న కాంట్రాక్ట ర్లకు భరోసాగా నిన్ననే 100 కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేశామని మంత్రి చెప్పారు.
నేను 6 సార్లు ప్రజల ఆశీర్వాదంతో చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతిని ధిని, ఈ సుదీర్ఘ రాజకీయ జీవితం లో చిన్న మచ్చ(ఆరోపణ) కూడా నాపై లేదు.నేను అవినీతిని ప్రోత్స హించే వ్యక్తిని కాదు..అవినీతి జరి గితే చూస్తూ ఊరుకోను. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చే సి,ఆమరణ దీక్షతో ప్రాణ త్యాగానికి సిద్ధ పడ్డోడిని నా చివరి శ్వాస వర కు తెలంగాణ ప్రజల మేలు కోసమే పనిచేస్తానని” మంత్రి ఎమోషనల్ అయ్యారు.మీరు ఎంత అరిచి గీ పె ట్టినా దేశా నికి రోల్ మోడల్ రోడ్లు నిర్మించి తీరుతామని తేల్చి చెప్పా రు.
అద్దం లాంటి రోడ్లు గనుక పూర్త యి తే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ 10 సీ ట్లకే పరిమితం అవుతుందనే భ యం మీకు పట్టుకుందనీ, పసలేని ఆరోపణలతో పదే పదే అబద్ధాలు చెప్పి అవి నిజం అవుతాయనుకో వడం మీ భ్రమ అన్నారు. చింత చ చ్చినా పులుపు చావలేదన్నట్లు..” తెలంగాణ ప్రజలు మీ అహంకా రా న్ని ఇంకా గమనిస్తున్నారు అంటూ బిఆర్ఎస్ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా రు.
