Tuesday, September 29, 2026
More
    HomePoliticsBharatiya Sakshya Adhiniyam : భారతీయ సాక్ష్య అధినియంపై న్యాయవాదులకు అవగాహన

    Bharatiya Sakshya Adhiniyam : భారతీయ సాక్ష్య అధినియంపై న్యాయవాదులకు అవగాహన

    📰 Generate e-Paper Clip

    — సీనియర్ న్యాయవాది విద్యా సాగర్ రెడ్డి

    Bharatiya Sakshya Adhiniyam : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: న్యా యవాదులు నిరంతర విద్యార్థులు నిరంతర పఠనంతోనే న్యాయవాదు లు కేసులను సరిగా నిర్వహించగ లుగుతారని వరంగల్ సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ లో న్యాయవాదుల కు చట్టాలపట్ల అవగాహనా పెంచేం దుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అయన ఆర్ట్ అఫ్ క్రాస్ ఎక్సమి నేషన్ మరియు భారతీయ సాక్ష్య అధినియం పై అవగాహన కల్పించా రు. మారుతున్న చట్టాలపట్ల న్యా యవాదులు అవగాహన పెంచుకో వాలని సూచించారు.

    అదేవిదంగా హైకోర్ట్ న్యాయవాది బి. భరత్ ఆర్టి ఫిషయల్ ఇంటెలిజె న్స్ ఉపయోగించి న్యాయవాదులు మంచి ఫలితాలు పొందవచ్చన్నా రు. నల్లగొండ బార్ అసోసియేషన్ మరియు ఇండియన్ అసోసియేష న్ అఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో శని వారం అవగాహన కార్యక్రమం నిర్వ హించారు.

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లా యర్స్ జిల్లా అధ్యక్షుడు అయిన క ట్టా అనంత రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియే షన్ కార్యదర్శి మంద నగేష్, ఐ ఏ యల్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, బార్ కౌన్సిల్ సభ్యుడు దు స్స జనార్దన్, సీనియర్ న్యాయవా దులు మునగాల నారాయణరావు, గుండె వెంకటేశ్వర్లు, మల్లేపల్లి అది రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి. జవహర్ లాల్ , జి. వెంకటరమ ణా రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నాంపల్లి నర్సింహా, ఐ ఏ యల్ జి ల్లా ప్రధాన కార్యదర్శి బి. వెంకన్న, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.