Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

    District Collector Ila Tripathi : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

    📰 Generate e-Paper Clip

    –రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబె ట్టుకుని, నాణ్యత ప్రమాణాలతో తీ సుకురావాలి

    –నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జి ల్లాలో ఈ వానా కాలం ధాన్యం సే క రణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమ వారం ఆమెకనగల్ మండలం పగి డిమర్రి లో ఐకెపి ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని తనిఖీ చేశారు. ఇటీవల కురి సిన వర్షానికి ధాన్యం తడవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏ పిఎం, సెంటర్ ఇన్చార్జి లకు షో కా జ్ నోటీసులు జారీ చేశారు.

    వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధా న్యం తడవకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పదేపదే హెచ్చరించిన ప్ప టికీ నిర్లక్ష్యం వహించినందుకుగాను పై చర్యలు తీసుకున్నారు.దాన్యం సేకరణలో ఎవరు నిర్లక్ష్యం వహిం చినా సహించేది లేదని హెచ్చరించా రు. పగిడిమర్రిలో ఐకెపి ద్వారా ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం సరైన స్థలంలో లేనందున త క్షణమే ఇతర ప్రదేశానికి మార్చా ల ని, ఇందుకుగాను అనువైన ప్రభు త్వ స్థలాన్ని చూడాలని తహసిల్దా ర్ పద్మను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రతిరోజు ధా న్యం తేమశాతాన్ని పరీక్షించాలన్నా రు. ధాన్యాన్ని కొని తూకం వేసిన త ర్వాత జాప్యం చేయకుండా వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు పం పించాలన్నారు.

    జాప్యం చేస్తే అటు రైతుకు, ఇటు మిల్లర్లకు ఇబ్బంది కలుగుతుంద న్నారు. మిల్లర్లు కూడా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. రైతులు తాలు,తరుగు లేకుండా సరైన తే మశాతంతో పూర్తి నాణ్యత ప్రమా ణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేం ద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చే శారు. మొంత తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉం చాలని, ఎండ వచ్చినప్పుడు మాత్ర మే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, సరైన తేమ, నాణ్యత ప్రమాణాల తో ఉంటే వెంటనే ధాన్యాన్ని కొ ను గోలు చేసి మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.

    డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ వై. అ శో క్ రెడ్డి ,డిఎస్ఓ వెంకటేశం, పౌరస రఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో సుమ లత ఏపిఎం మైసేశ్వరరావు తదిత రులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.