Election Commission of India : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో ప్ర స్తుత పరిస్థితులలో బీహార్ ఎన్నిక లు రాజకీయ దుమారం రేపుతున్న తరుణంలో మరో ఉత్కంఠ భరిత అంశం తెరమీదకు వచ్చింది. బిహా ర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ నిర్వహించడంపై తీవ్ర దు మారం రేపుతున్న వేళ దేశవ్యాప్తం గా రెండో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీ సుకుంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ రెండో దశను నిర్వ హించనున్నట్లు వెల్లడించింది. తా జాగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సం ఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కు మార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ సెకండ్ ఫేజ్ ప్రారం భిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచే ఆరంభం కానుందని పేర్కొన్నారు.
ఈ నెల 28వ తేదీ మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రా రం భం అవుతుందని సీఈసీ జ్ఞానేష్ కు మార్ వెల్లడించారు. దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతా ల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ జర గనున్నట్లు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గో వా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజ రాత్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి వం టి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆ ర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లె వ ల్ అధికారులు బీఎల్ఓలు ప్రతి ఓ టరు ఇంటిని కనీసం 3 సార్లు సంద ర్శించి కొత్త ఓటర్లను జాబితాలో చే ర్చడానికి ఏవైనా తప్పులను సరిది ద్దుతారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బీఎల్ఓలు ఇంటింటి కీ వెళ్లి ఫారం-6, డిక్లరేషన్ ఫారాల ను సేకరించి, కొత్త ఓటర్లు ఫారాల ను నింపడానికి, ఎలక్టోరల్ రిజిస్ట్రే షన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) లేదా అసి స్టెంట్ ఈఆర్ఓకి అందజేస్తారని తె లిపారు.ఎస్ఐఆర్ రెండో దశ శిక్షణ కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయని ప్రధాన ఎ న్నికల కమిషనర్ తెలిపారు. అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు రానున్న రెం డు రోజుల్లో రాజకీయ పార్టీలతో స మావేశమై ఎస్ఐఆర్ ప్రక్రియపై వా రికి వివరించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేశారు.ఏ పోలింగ్ స్టేషన్‌లో నూ 1200 కం టే ఎక్కువ ఓటర్లు ఉండరని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చే శారు.
ఇదిలా ఉండగా ఇక ఈ సర్వేలో చ నిపోయిన వారు, బదిలీ చేయబ డి న వారి ఓటర్లను తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిం ది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హ క్కు కల్పించడమే ఎస్ఐఆర్ కార్యక్ర మం లక్ష్యమని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణలు తప్ప నిసరని పేర్కొంది. ఎన్నికలు జరు గుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితాను సీజ్ చేస్తా మని ప్రకటించింది.
ఇప్పటివరకు దేశంలో 1951 నుం చి 2004 మధ్య 8 స్పెషల్ ఇంటెన్సి వ్ రివిజన్ చేశారని కేంద్ర ప్రధాన ఎ న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. రాజకీయ పార్టీలు అ నేక సందర్భాల్లో ఓటర్ల జాబితాల నాణ్యత సమస్యను లేవనెత్తాయని తెలిపారు. కాగా బిహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఎస్ఐఆ ర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే. దాదాపు 7.5 కోట్ల పేర్ల తో కూడిన తుది జాబితా సెప్టెంబర్ 30వ తేదీన ప్రచురించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6, 11వ తేదీ తేదీల్లో రెండు దశల్లో జరుగనుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్న విషయం తెలి సిందే.
