CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజె క్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్య యనం పూర్తి చేసి నివేదికలను త యారు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించారు. ప్రాజెక్టుల వా రిగా విశ్లేషణలు జరగాలని స్పష్టం గా చెప్పారు. కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్’ (CDSE) కు సం బంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (CR Paatil) ఇటీవ ల రాసిన లేఖపై ముఖ్యమంత్రి మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉ న్నత స్థాయి సమావేశంలో సమీక్షిం చారు.
నీటి పారుదల ప్రాజెక్టులకు సంబం ధించి కేంద్ర జల శక్తి మంత్రి లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారు లకు వివరించిన ముఖ్యమంత్రి, అం దుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారి గా సమగ్రమైన వివరాలతో విశ్లేషణ లు జరగాలని, రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌లను త యారు చేయాలని ఆదేశాలిచ్చారు.
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యా రేజీల పరిస్థితిపైనా సమావేశంలో ముఖ్యమంత్రిసమీక్షించారు. బ్యారే జీల మరమ్మత్తులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇం దుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్య త వహించేలా చూడాలని అధికా రులకు చెప్పారు.
ప్రాజెక్టుల వారీగా రూపొందించే పూ ర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదు పరి తీసుకోవాల్సిన చర్యలపై నవం బర్ రెండో వారంలో మరోసారి సమీ క్ష సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణ యించారు.
తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వర కు 80 టీఎంసీల నీటిని తరలించ డానికి వీలుగా ప్రాజెక్టుకు అవసర మైన ప్రణాళికలను తయారు చే యాలని ముఖ్యమంత్రి అధికారు లకు సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సమీక్ష లో చర్చించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రణాళికలు సిద్ధం కావాలని చె ప్పారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా అంచనాలను తయారు చేయాలని సూచించారు.
సుందిళ్లను మరమ్మత్తు చేసి విని యోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎ ల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచ నా లు సిద్ధం చేయాలని కూడా ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించారు.
