Wednesday, September 30, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిసి ఐ అప్పీల్, తెలంగాణ...

    Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిసి ఐ అప్పీల్, తెలంగాణ పత్తి రైతుల కష్టాలు తీర్చండి, తేమశాతం తగ్గిం చండి

    📰 Generate e-Paper Clip

    –పత్తి మద్దతు ధర పెంచి తెలంగా ణ రైతును ఆదుకోండి

    Minister Komatireddy Venkata Reddy :

    ప్రజా దీవెన, ముంబై:తెలంగాణ రా ష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొం టున్న ఇబ్బందులపై రాష్ట్ర రోడ్లు భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళ వారం ముంబైలో కాటన్ కార్పొరేష న్ ఆఫ్ ఇండియా (CCI) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను తో ప్రత్యేకంగా భేటి అ య్యారు. వారిద్దరి మధ్య సుదీర్ఘం గా సాగిన ఈ సమావేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎంఎస్ పి సేకరణ, మరియు రైతులకు తక్షణ ఉపశమనం అందించాల్సిన అవస రాన్ని మంత్రి సీసీఐ చైర్మన్ కు వివ రించారు.

    తెలంగాణతో సహా దక్షిణ భారత రాష్ట్రాలలో అధిక తేమ స్థాయిలు ఉన్న కారణంగా, ప్రస్తుత FAQ (Fa ir Average Quality) నిబంధనల ప్రకారం నిర్దేశించిన 8-12% తేమ శాతాన్ని పాటించడం అసాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కురి సిన అకాల వర్షాలు, తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అందుకే, రైతులకు నష్టం జరగకుండా ఉండేం దుకు తేమ శాతాన్ని తక్షణమే 14% వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

    పెరుగుతున్న సాగు ఖర్చులకు అ నుగుణంగా పత్తికి కనీస మద్దతు ధ ర (MSP)ని సవరించాలని, అలాగే అన్ని పత్తి పండించే జిల్లాల్లో CCI కొనుగోలు కేంద్రాలను విస్తరించి, ప్రై వేట్ వ్యాపారుల దోపిడీ నుండి రై తులను కాపాడాలని కోరారు. తెగు లు నష్టం (Pink Bollworm Pest) మరియు అకాల వర్షాలతో నష్టపో యిన రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ అందించాలన్నారు.

    గత సీజన్లలో సేకరించిన పత్తికి సం బంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చే యాలని, మార్కెట్ యార్డ్ స్థాయి లో ఆధునిక తేమ పరీక్షా కేంద్రాల ను ఏర్పాటు చేయాలి.తెలంగాణ రైతులకు న్యాయం జరిగి, వస్త్ర సర ఫరా గొలుసు బలోపేతం అయ్యేలా CCI చైర్మన్ వ్యక్తిగత శ్రద్ధ వహించా లని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థించారు. మంత్రి తన విజ్ఞ ప్తి లో పేర్కొన్న సమస్యలను కేంద్ర ప్ర భుత్వం తో చర్చించి, సానుకూలం గా పరిష్కరిస్తామని CCI చైర్మన్ ల లిత్ కుమార్ గుప్తా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి హామీ ఇచ్చారు.

    మంత్రి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అని రుద్ రెడ్డి కూడా ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.