Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లో ఓటమి ఫ్రస్టే షన్ కనిపిస్తోందని మాజీ మంత్రి, సి ద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రా వు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధి కారంలోకి వచ్చిన తర్వాత రెండేం డ్లలో చేసింది చెప్పుకోవడానికి కాం గ్రెస్ కు ఏమీలేక ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశా రు.ఎ న్నికల కోసమే రేవంత్ కు పీజే ఆర్, ఎన్టీఆర్ గుర్తుకొచ్చారని, ఎన్టీ ఆర్ అభిమానులెవ్వరూ కాంగ్రెస్ కు ఓటెయ్యరని స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆదివారం ఆయన మోతీ నగర్ లో మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్ ఎం దుకు బయటకు రాలేదంటూ ప్రశ్నిం చారు. రెచ్చగొట్టి ఓట్లు పొం దాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎన్టీ ఆర్ పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. ఎన్నికల ముందు పోలీ సులు బైండోవర్ చేసే ది రౌడీలనే క దా, జూబ్లీహిల్స్ లో మా గెలుపు ఖాయమని, మెజారిటీ కోసమే వె యిటింగ్ రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు.
కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిది ఫెవికాల్ బంధమని, బీజేపీతో అంటకాగు తున్న సీఎం ఢిల్లీలో చీకటి ఒప్పం దాలు చేసుకుంటున్నారని ధ్వజ మె త్తారు. దొంగే దొంగ అన్నట్టుగా సీఎం రేవంత్ తీరు ఉందని విమ ర్శించా రు. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారన్న ఆరోపణ లతో ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని, గతం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగాయ ని ఆ వి వరాలు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పా లనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం ఉత్తి మా టేనని విమర్శించారు.
కాంగ్రెస్ చేతలన్నీ బడా బాబులకు వంత పాడేలా ఉన్నాయని మండిప డ్డారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రెండు రూపాయలూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు మాత్రం భారీగా బిల్లు లు చెల్లించింది. సీఎంకు పిల్లల చదువులు ముఖ్య మా కాంట్రాక్టర్లు ఇ చ్చే కమీషన్లు ముఖ్యమా అని నిలదీశారు. ఉ ద్యోగులకు ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తె లంగాణ అని విమర్శించారు.
పీజేఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రె్‌సకు లేదన్నారు. అంబే డ్కర్ పేరుందనే సచివాలయానికి రావ డం లేదని ఆరోపించారు. వెంకటే శ్వరస్వామి కల్యాణం పేరుతో జూ బ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ చీరలు, సారెలు పంచుతోందని, ఎన్ని చేసి నా ఓటర్లు లైన్లు కట్టి బీఆర్‌ఎ్‌సకే ఓటేయాలని డిసైడ్ అయ్యారన్నారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కిష న్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మోదీ శిష్యులేన ని విమర్శించారు. ఉప ఎన్నికలో ఎ లాగైనా గెలవాలని భావిస్తున్న కాం గ్రెస్ పార్టీ ప్రణాళికా బద్ధంగా అక్ర మాలకు పాల్పడుతోందని దాసోజు శ్రావణ్ కుమార్ ఆరోపించారు.

