బిగ్ బ్రేకింగ్, ప్రముఖ కవి అందెశ్రీ అస్తమయం, పలువురి నివాళులు
PoetAnde Sri : ప్రజా దీవెన హైదరాబాద్: ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ సోమవారం ఉదయం అస్తమించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తె లంగాణ’ సృష్టికర్త కూడా అయిన అందెశ్రీ (64) అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంతకాలంగా అనా రో గ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఆయన నివాసం లో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోవడoతో కుటుంబీ కు లు గాంధీ ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో కన్నుమూసి నట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా నాలుగు రోజులు గా తీవ్ర జ్వరంతో అందెశ్రీ బాధ పడు తున్నారు. ఆయన స్వస్థలం సిద్ది పేట జిల్లా రేబర్తి వాస్తవ్యులు కాగా అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న కావడం గమనార్హం. ఇది లా ఉంటే 1960లో నల్లగొండ జిల్లాలో అందెశ్రీ జన్మించారు.ఆయన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు.
2006లో ‘గంగ’ సిని మాకు అందెశ్రీకి నంది పురస్కారం అందుకు న్నారు. 2014లో అకాడ మి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్ట రేట్ పొందారు. 2015లో దాశ రథి సాహితి పురస్కారం అందెశ్రీ అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం సాధించిన విషయం తెలిసిందే.
