BRSMLA HarishRao: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యా న్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డ బ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చే స్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అధికార దుర్విని యోగానికి పాల్ప డుతోన్న అధికారులపై చర్యలు తీ సుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బిఆ ర్ఎస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి అన్ని వీడియో, ఫోటో ఆధా రాలతో సహా ఎలక్షన్ కమిషన్ (Ec ) సమ ర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీ ష్ రావు మీడియాతో మాట్లాడు తూ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే… కొంతమంది పోలీస్ అధికారు లు, ఇతర అధికారులు అధికార పా ర్టీకి తొత్తులుగా మా రిపోయారు. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నాము. పో లీసు అధికారు ల కు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవ డం లేదు.
అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చే సినా జూబ్లీహిల్స్ ( jublih ills) ఓటర్లు తెలి వైన వారను, తగిన రీతిలో కాంగ్రెస్ కు బు ద్ధి చెబుతారు. ఇంత అ ధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎ న్నికల అధికారులు పట్టిం చుకోవ డం లేదు. అన్ని విషయాలను ఎల క్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వ చ్చాము.
సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమ ర్పించాము. ముఖ్యంగా మహి ళా పోలీస్ అధికారులను, ఆశా, అంగ న్వాడి వర్కర్లను అక్కడ ని యమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పో లింగ్ బూ త్ లోకి అనుమతించాలని కోరా ము. ఓటర్ ఐడి గుర్తిం చకుండా ఓ టర్లను పోలింగ్ బూతులకు పంపించకూడదు.
మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌం ట ర్ ఏర్పాటు చేయాలి. ముఖ్యం గా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశా రు. ఫేక్ ఐడి కార్డుల వీడియో ను ప్ర ధాన ఎన్నికల అధికారికి సమర్పిం చడం జరిగింది.ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా కాంగ్రెస్ అధికార దుర్విని యోగము, ఫేక్ ఐడీ కార్డుల వివరా లను అందించాము. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధి కారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
యూసుఫ్ గూడాలో కాంగ్రెస్ కా ర్యాలయమును ఆనుకొని పోలింగ్ బూత్ ఉంది. కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతా రు. దీనికి సంబంధించి కూడా ఆధా రాలను ఎన్నికల కమి షన్ కు ఇచ్చాం. ముఖ్యమంత్రి రెండు సంవ త్సరాలుగా ఆరు గ్యా రెంటీలపై రి వ్యూ పెట్టడానికి టైం దొరకలేదు. ఈ రోజు 6 గ్యారంటీ లపై రివ్యూ పెట్ట డం ఎందుకు. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెం టీలకు చట్టబద్ధత కల్పి స్తామని హామీ ఇచ్చి మోసం చేశా రు.
ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అ యినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతు న్నాడు. ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీ హిల్స్ ఓటర్లను ప్ర భావితం చేయడమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీ యాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రా మాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని హరీ శ్ రావు పునరు ద్ఘాటిం చారు. ఈసీ ని కలిసిన బిఆర్ఎస్ ప్రతినిధి బృం దంలో మాజీ మం త్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యు లు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
