Monday, September 28, 2026
More
    HomePoliticsSP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అల్టిమేటం, ర్యాగింగ్...

    SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అల్టిమేటం, ర్యాగింగ్ పాల్పడితే కఠి న చర్యలు

    📰 Generate e-Paper Clip

    SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని విద్యార్ధులకు అవ గాహన నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ర్యా గింగ్ అనే విష సంస్కృతికి దూరం గా ఉండాలని, తమ తోటి విద్యార్థు లతో సోదరభావంతో మేల్కొనా లని, సీనియర్లు, జూనియర్లు అని బేదం వీడనాడుతూ నేటి సీని య ర్లు ఒకప్పుడు జూనియర్లు అనే విష యం మరచిపోవద్దన్నారు.

    తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పా ల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ప్రొ హిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం, ర్యాగింగ్‌కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే, 6 నెలల నుండి 3 సంవ త్సరాల వరకు జైలు శిక్ష ఉంటుం దని చెప్పారు.

    ర్యాగింగ్ అనగా వ్యక్తులను, మాన సికంగా లేదా శారీరకంగా అవమాన పరచడం, భయపెట్టడం, భయం క లిగేటట్లు చేయడం, వారి పట్ల అమ ర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం త దితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పీపీటీ ద్వారా అవగాహ న కల్పించారు. సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనర్దాలు జరుగుతా యని, చట్టాలు కూడా చాలా పటి ష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేయబడతాయ ని చెప్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చే యిస్తూ ర్యాగింగ్ అనే భూతాన్ని క ళాశాల నుండి తరిమేయాలని సూ చించారు.

    ఎంతో కష్టపడి చదివి మెడికల్ కా లేజీలో సీటు సంపాదించుకొని ర్యా గింగ్ అనే క్షణిక పాశవిక ఆనందా నికి చేస్తే, కేసులు నమోదై, జైలు కి వెళ్తే వారి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో కూడా గుర్తు పెట్టుకోవాల ని సూచించారు. ఎవరైనా ర్యాగిం గ్‌కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా స మాచారం అందించాలన్నారు.

    ఈ కార్యక్రమంలో డిఎస్పి నల్గొండ కె శివరాం రెడ్డి, ఎస్బి సిఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎ స్సై సైదులు కళాశాల ప్రిన్సిపాల్ స త్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రా ధాకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.