District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు భద్ర తను ప్రతి ఒక్కరు వ్యక్తిగ త బాధ్య త గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స మావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశం లో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమా దాలు పెరిగిపోతున్నాయి, దీనివల్ల మనుషుల ప్రాణాలు పోయి కుటుం బాలు వీధిన పడుతున్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించాల్సి న అవసరం ప్రతి ఒక్కరిపై ఉంద న్నారు.
మానవ తప్పిదాల వల్ల రొడ్డు ప్రా మాదాలు జరగకుండా చూడాలి, ఇందుకు వివిధ శాఖలు సమన్వ యంతో వ్యక్తిగత శ్రద్ధ వహించి పని చేయాలి. రోడ్డు ప్రమాదాలు జరిగేం దుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఇకపై అక్కడ ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చ ర్యలు చేపట్టాలి. ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూ చించిన ప్రదేశాలలో ప్రమాదాల ని వారణకు ఆర్ అండ్ బి ,నేషనల్ హైవే ,అలాగే ఇతర శాఖలు పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలి, స్కూల్ బస్సుల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రతి స్కూలు వా హ నానికి సైడ్ మిర్రర్లు ఏర్పాటు చేయ డమే కాకుండా, బస్సులో సహాయ కున్ని తప్పనిసరి గా ఉంచేలా చర్య లు తీసుకోవాలి ,వారి నుండి ఇండె మినెట్ బాం డును తప్పనిసరిగా తీసుకోవాలి, ఆర్టీసీ బస్సుల ద్వారా యాక్సిడెం ట్లు జరగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలి , ప్రమాదాలను నివారించేందుకు అ న్ని వాహనాల కు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇటీవల వర్షాల వల్ల చిట్యాల అం డర్ పాస్ వద్ద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది, ఈ విషయంపై ఇరిగేషన్, నేషనల్ హై వే, ఆర్ అండ్ బి తదితర శాఖలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదే శించారు. ఇదే సమస్య ఇనుపాము ల వద్ద కూడా గుర్తించడం జరిగింద ని పోలీసు అధికారులు జిల్లా కలెక్ట ర్ దృష్టికి తీసుకురాగా దానిపై కూ డా తక్షణం స్పందించాలని ఆదేశిం చారు .మర్రిగూడా బైపాస్ వద్ద రో డ్డుపై గుంతలు పడినందున మొరం వేయించారని అన్నారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాకు సం బంధించి న వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పోలీ సు శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు అధి కారికంగా తెలియజేయడం జరుగు తున్నదని, వీటన్నిటినిపై తక్షణమే స్పందించి ప్రమాదాలు నివారించా లని, చిట్యా ల అండర్ పాస్ వద్ద వర్షపు నీరు ని లిచిపోవడం వల్ల నా లుగైదు రోజు లు తీవ్ర ఇబ్బందుల కు గురి కావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కా రం కనుక్కోవాలని జిల్లా కలెక్టర్ తో కోరారు. సర్వీస్ రో డ్లు లేకుండా పె ట్రోల్ బంకులు ని ర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసుకు నే విధంగా చర్య లు చేపట్టాలన్నా రు.
ప్రత్యేకించి ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల భ ద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, నల్గొండ పట్టణం లో క్లాక్ టవర్ ,వైఎస్ఆర్ చౌరస్తా తదితర చౌరస్తాలలో లైటింగ్, ట్రా ఫి క్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు జి ల్లా కలెక్టర్ తో కోరారు.
జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమి షనర్ వాణి , జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ , ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి, ఆర్ ఎమ్ ఆర్టిసి. కె. జానీ రెడ్డి, జిల్లా వి ద్యాశాఖ అధికారి బిక్షపతి, ము న్సి పల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అ హ్మద్, డీఎస్పీ శివరాం రె డ్డి, పోలీస్ అధికారులు తదితరులు హాజర య్యారు.

