Tuesday, September 29, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, ధాన్యం...

    District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, ధాన్యం సేకరణ నియ మాల ఉల్లంఘనలో ఉద్యోగులపై వేటు

    📰 Generate e-Paper Clip

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ధాన్యం సేక రణ నియమాలను ఉల్లంఘించి ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా రైతుల పొలం వద్దనే కొను గోలు చేసి నేరుగా మిల్లులకు పం పించినందుకు గాను నల్లగొండ జి ల్లా మిర్యాలగూడ ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కు మా రి అఫ్రీన్ ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, ఆలగడప వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ సిఈఓ కే. సైదులు ను వి ధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

    సన్న రకం ధ్యానాన్ని కొనుగోలు కేం ద్రాల ద్వారా కొనుగోలు చేయకుం డా నేరుగా మిల్లులకు పంపించి న ట్లు వివిధ దినపత్రికలు, ఎలక్ట్రాని క్ మీడియాలో వచ్చిన వార్తలపై జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి ఈ విషయంపై విచారణ నిర్వహిం చాలని జిల్లా సహకార అధికారిని ఆదేశించడం జరిగింది.

    జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ ఈనెల 9 న అవంతిపురం వ్యవసా య మార్కెట్ యార్డు దాన్యం కొను గోలు కేంద్రానికి వెళ్లి పూర్తి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసీ ఓ రికార్డులను పరిశీలించగా, అవంతిపురం -1 ధాన్యం కొనుగో లు కేంద్రానికి 14 మంది రైతులు దా న్యం తీసుకురాగా, బి .అన్నారం గ్రా మానికి చెందిన ఇద్దరు రైతులు సై దిరెడ్డి ,సుశీల్ నాయక్ లు వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని తమ పొలం నుండే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేం ద్రం ఇన్చార్జి కే. సైదులును కోరార న్నారు.

    ఇందుకు ఆలగడప క్లస్టర్ వ్యవ సా య విస్తరణ అధికారి కుమారి ఆఫ్రి న్ తో నిర్ధారణ చేసుకున్న అ నంత రం అవంతిపురం కొనుగోలు కేంద్రం నుండి ఆ ఇద్దరు రైతులకు సంబం ధించిన (750) బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ట్రక్ సీట్ ఇవ్వ డం జరిగిందని, రైతుల పొలాల నుండే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మిర్యాలగూడలోని శ్రీ శివ సాయి రైస్ ఇండస్ట్రీస్ కు పంపించి నట్లు తన నివేదికలో పేర్కొన్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

    తన మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని మి ల్లర్ దింపుకోవడమే కాకుండా, దిం పుకున్నట్లు అనుమతి సీట్ జారీ చే యడంతో ట్యాబ్ ఎంట్రీ కూడా పూ ర్తయిందని పేర్కొన్నారు.నిబంధనల ప్రకారం రైతులు పండించిన ధాన్యం ముందుగా కొనుగోలు కేంద్రాలకు వ చ్చిన తర్వాత అక్కడ అన్ని అంశా లు పరిశీలించిన మీదట ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపిం చాల్సి ఉండగా, ఈ ప్రక్రియ నిబం ధనలను ఉల్లంఘించి క్షేత్రస్థాయి నుండే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ట్లు ట్రక్ సీటు జారీ చేసినందుకుగా ను విచారణ నివేదిక ,రికార్డుల ఆ ధారంగా ఆళ్లగడప వ్యవసాయ వి స్తరణ అధికారి అఫ్రీన్ ను,అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ఇన్చార్జి కే. సైదులు ఇద్దరిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

    సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉ న్నంతవరకు ముందస్తు అనుమతి లేకుండా కార్య స్థానం వదిలి వె ళ్ళ కూడదని జిల్లా కలెక్టర్ ఆదేశిం చా రు. ధాన్యం సేకరణలో ఇలాంటి వి మళ్లీ చేస్తే ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.