Suicide Blast : ప్రజా దీవెన, ఇస్లామాబాద్: దా యాది పాకిస్థాన్ రాజధాని ఇస్లా మాబాద్ భారీ పేలుడుతో దద్దరిల్లిం ది. మంగళవారం నగరంలోని జ్యు డీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరి గిన శక్తిమంతమైన పేలుడు సంఘ టనలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయ పడ్డారని అక్కడి స్థానిక సంస్థలు ప్ర కటించాయి. మృతుల్లో అత్యధికు లు న్యాయవాదులేనని పాక్ మీ వె ల్లడించాయి. ఇది ఆత్మాహుతి దా డి అని పాకిస్థాన్ అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యా హ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించిం ది. ఇది అత్యంత రద్దీగా ఉండే స మయం కావడంతో ప్రాణనష్టం ఎ క్కువగా జరిగింది. ప్రాథమిక దర్యా ప్తు ప్రకారం కారులోని గ్యాస్ సిలిం డర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరి గిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహు తి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కి లోమీటర్ల దూరం వరకు పేలుడు శ బ్దం వినిపించినట్లు స్థానికులు తె లి పారు.నేను నా కారు పార్క్ చేసి కాంప్లెక్స్‌లోకి వెళుతుండగా, గేటు దగ్గర పెద్ద శబ్దం వినిపించింది. అక్క డ రెండు మృతదేహాలు పడి ఉన్నా యి. అనేక కార్లు మంటల్లో కాలిపో తున్నాయని రుస్తుమ్ మాలిక్ అనే న్యాయవాది ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కు వివరించారు. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సా నుభూతి తెలిపారు.ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా ద ళాలు ఓ ఉగ్రకుట్రను భగ్నం చేశా యి. వానాలోని కేడెట్ కాలేజీపై తె హ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీ పీ) ఉగ్రవాదులు చేయబోయిన దా డిని భద్రతా దళాలు అడ్డుకుని, ఇ ద్దరు ఉగ్రవాదులను హతమార్చా యి. 2014లో పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై జరిగిన తరహా దాడినే పునరావృతం చేయాలని ఉగ్రవాదు లు ప్రయత్నించారని పాక్ సైన్యం వె ల్లడించింది. ఆనాటి దాడిలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోన్న విషయం విదితమే. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారం లోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీ పీ కార్యకలాపాలు పెరిగాయని కూ డా బహిరంగరహస్యమే. టీటీపీ నా యకులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం క ల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపి స్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం కూడా తెలిసిందే.
