Tuesday, September 29, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక సూచన, సహజ వ్యవసాయంతోనే...

    Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక సూచన, సహజ వ్యవసాయంతోనే కల్తీలేని ఆరోగ్యకరమైన ఆహారం 

    📰 Generate e-Paper Clip

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: సహజ వ్యవసాయం ద్వారా కల్తీలేని ఆరో గ్యకరమైన ఆహారం లభిస్తుందని, రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తే నాణ్యతతో పంటలు పండుతాయ ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. దీనిని దృష్టిలో ఉంచుకొని సహ జ వ్యవసాయాన్ని ప్రో త్సహించా ల్సిన అవసరం ఉందన్నారు. గురు వారం ఆమె మునుగోడు నియోజ కవర్గంలోని కిష్టాపురం గ్రామంలో ర సాయన ఎరువులు, పురుగుమం దులు వాడకుండా యువరైతు జ క్కుల వెంకటేశ్ పండిస్తున్న సహజ పంటలను పరిశీలించారు.

    ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స హ జ పంటలను ఏవిధంగా పండి స్తు న్నారని అడిగి తెలుసుకున్నారు.ఈ పంటల వలన లాభాలు, పంటలు ఏవిధంగా ఉన్నాయి, ఈ పంటలు కావలసిన సహజ ఎరువులు వంటి వివరాలు అడిగారు. జీవామృతం జీవగణామృతం వాడతామని వెం కటేష్ చెప్పారు.

    సహజ వ్యవసాయం ద్వారా రైతుల ఉత్పత్తి వ్యయాలు తగ్గి, నాణ్యమై న పంటలు, పర్యావరణానికి హాని లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, జిల్లాలో సహజ వ్య వసాయాన్ని ప్రోత్సహించాలని, రై తులు ఈ పద్ధతిని అవలంబిస్తే భూ సారాన్ని కాపాడుతూ ఆరోగ్యకర మైన పంటలను ఉత్పత్తి చేయగలు గుతారని అన్నారు.

    సహజ పద్ధతిలో సాగుచేయాల ను కున్న రైతులకు సాంకేతిక సాయం అందించాలని అధికారులకు సూ చించారు. ఈనెల 22 న నల్లగొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉ దయాదిత్య భవన్ లో సహజ వ్య వసాయంపై విజయరామ సహజ వ్యవసాయ నిపుణుల అవగా హ న శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామ న్నారు.

    రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జిల్లా వ్యవసా య అధికారి శ్రవణ్ కుమా ర్, ఆర్డీవో శ్రీదేవి ,జిల్లా అనంతరెడ్డి ఏడి వేణు గోపాల్ తదితరులు పా ల్గొన్నారు.

    *ధాన్యం కొనుగోలు కేంద్రంలో క లెక్టర్ ఆకస్మిక తనిఖీ….* ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యత ప్ర మాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెం టనే కొనుగోలు చేయాలని జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గు రువారం ఆమె మునుగోడులో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు పరి శీలించారు.

    17 శాతం తేమతో, తాలు ,తరుగు లేకుండా. నాణ్యత ప్రమాణలతో వ చ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయొద్దని, వ ర్షం కూడా లేనందున తేమను పరి శీలించి రైతులకు మేలు జరిగే వి ధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చే శారు.

    పి పి సిసెంటర్లో రైతులతో మాట్లా డుతూ ఏమైనా ఇబ్బందులు ఉ న్నాయా అని అడిగినారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఇబ్బంది లేవని చెప్పారు. పత్తి కొ నుగోళ్ల పై ఆమె మాట్లాడుతూ రై తులు 12 శాతం వరకు తేమ వ చ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసు కో వాలని అప్పుడు పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.

    ఈ కార్యక్రమంలో రెవిన్యూ అద న పు కలెక్టర్ జె. శ్రీనివాస్. జిల్లా గ్రా మీ ణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపికృష్ణ , జిల్లా పౌరసరఫరాల అధి కారి వెంకటేష్, జిల్లా సహకార అధి కారి పత్య నాయక్, ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ నరేష్, సెక్రెటరీ సుఖేం దర్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.