BRSHarishRao : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ ఇం డస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫ ర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండ స్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని, పారిశ్రామికవాడల్లోని దా దాపు పది వేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునే కుట్ర కు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్ర స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొ త్తగా చేస్తున్న స్కామే ఈ కొత్త పాల సీ అని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివా రం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రా వు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అడ్డగోలు దోపిడీ మీదనే దృ ష్టి పెట్టిండు రేవంత్ రెడ్డి లగచర్ల కా వొచ్చు, హెచ్ సీయూ భూ ములు కావొచ్చు. ఇలా ఏది చూసినా దోపిడీ నే.ప్రజలకు ఏం చేయా లనే దోరణి కంటే కూడా, ఎక్కడ ఎంత దోపిడి చేయాలన్నదే రేవం తు ఆలోచన విధానం, మా హయాంలో అనుమతులు వార్తలు, పె ట్టుబడుల వార్తలు వచ్చేవి. అమ్మకాల వార్తలు కాంగ్రెస్ హయాంలో వస్తున్నయి.
మాది నమ్మకాన్ని పెంచిన ప్రభు త్వం అయితే, కాంగ్రెస్ అమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం గజాల లెక్కన మొదలు కొని, వేల ఎకరాల దాకా ప్రతి ఇంచు భూమి అమ్మేస్తున్నడు.హౌజింగ్ బోర్డు లో ఉన్న ఆరు గజాలు, ఎనిమిది గజాలు కూడా అ మ్ముతున్నడు రేవంత్ రెడ్డి, గ తంలో ఇదే రేవంత్ రెడ్డి భూములు అ మ్ముకుంటూ పోతే ఎలా, ఆ సుపత్రులు, విద్యాలయాలు చివరకు స్మశానాలు ఏర్పాటు చేయడా నికి కూడా భూములు మిగలవన్నాడు.
నాడు సుద్దపూస లేక్క మాట్లాడి, ఇప్పుడు భూములు తెగనమ్ముతు న్నడు.భవిష్యత్తు అవసరాల కోసం భూములు మిగల్చవా రేవంత్ రెడ్డి. నగరం విస్తరణ జరిగితే, ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామిక భూ ములను 50శాతం భూమిని ప్రభుత్వం తీసు కొని, మిగతా 50శా తం భూముల ను ఫీజులు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నరు. కానీ రేవంత్ రెడ్డి మా త్రం కేవలం 30శాతం తీసుకొని తెగ నమ్ముతు న్నడు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి నిన్న బిఆర్ఎస్, కేటీఆర్ చెప్పిన మాటలు అక్షరసత్యం. శ్రీధర్ బాబు కూ డా కొన్ని ఒప్పుకున్నారు. అందుకు థ్యాంక్స్ , వేల కోట్లు, లక్షల కో ట్లు కొల్లగొట్టేందుకు తెరలేపిన స్కాం ఇది.
9292 ఎకరాల భూమిని 30శాతం రిజిస్ట్రేషన్ ద్వారా కట్టబెడితే 5వేల కోట్లు వస్తుందని శ్రీధర్ బాబు గారే చెప్పారు. 9292 ఎకరాల భూము ల విలువ 5లక్షల కోట్లు. 5లక్షల కో ట్లు విలువైన భూమిని 5వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారు. మిగ తా నాలుగు లక్షల 95వేల కోట్లు స్కాం కదా? ఎందుకు కట్టబె డుతు న్నారు. దీని వెను క ఉన్న మత్లబ్ ఏమిటి. 9292లో మొత్తం భూ మి కాదు, ఇందులో రోడ్లు, మోరీ పోగా 4740ఎకరాలే ఉంటదని మంత్రి బుకాయించా రు , నేను అథారిటీ గా చెబుతున్నాను.
రెవెన్యూ రీసోర్సు మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా చెబుతున్నా. నాతో పాటు కేటీఆర్ , ప్రశాంత్ ఇతర మంత్రులు ఉ న్నారు. ఆరోజు కూడా ఈ ప్రతిపాదన వ చ్చింది. శ్రీధర్ బాబు నేను సవాల్ చేస్తున్నా నిజంగా 4740 ఎకరాలే ప్రభుత్వం పెట్టిందా? దీనిపై బహిరం గ చర్చకు సిద్దమా? సగానికి సగం త గ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నా డు శ్రీధర్ బాబు. భూ కుంభకోణం పరిధి తగ్గిం చే ప్రయత్నం చేసారు మంత్రి. ప్రభుత్వం డొల్లతనం స్పష్టం గా బయ టపడ్డది, నిన్న కేటీఆర్ అ డిగిన అనేక ప్రశ్నలకు మంత్రి గాని, ప్రభు త్వం గాని సమాధానం చెప్ప లేకపోయింది.మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తో పోల్చితే రెండు రెట్ల స్కాం.
రెండు బడ్జెట్ లతో సమానమైన ఇంతటి నిర్ణయాన్ని అసెంబ్లీలో చ ర్చ పెట్టకుండా రాత్రికి రాత్రే చేస్తం అంటే ఎందుకు ఊరుకుంటాం. కేటీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూ డా ప్రభుత్వం ఎందుకు సమాధా నం చెప్పదు.కోర్టు ఆర్డర్ ఉన్నందున ఆ నాడు మేము ఆజామాబాద్ భూ ముల విషయంలో నిర్ణయం తీసు కున్నాం. ఎస్ ఆర్ వో కింద 200 శాతం తీసుకున్నం.ఈనాడు కాం గ్రెస్ మాత్రం 30శాతం కడితే చాలు అంటున్నది.5లక్షలు రావాల్సిన చో ట 5వేల కోట్లు మాత్రమే వస్తాయని మంత్రి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం ఇది.వారం రోజుల్లో అప్లికేషన్లు పె ట్టాలి, వారంలో టీజీ ఐఐసీ అప్లికే షన్ల పరిశీలన, అవతల వారం రోజుల్లో అధికారుల క మిటీ అనుమతి, ఇది వచ్చిన రెండు నెలల్లో మొత్తం స్కాం కథ పూ ర్తి.
అంటే 2 నెలల్లో 5లక్షల కోట్లకు స్కెచ్ వేసింది రేవంతు సర్కారు. మార్కెట్ లో అమ్మితే 5లక్షల కోట్లు వ స్తయి కదా అంటే సమా ధా నం లేదు? కోర్టు కేసులు, లీజుల వివా దాలు కారణం చూపి మొ త్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టాలని కుట్ర చేస్తున్నారా అంటే సమా ధా నం లేదు.ఆనాడు బొందల గడ్డకు కూడా భూముల ఉండ వు అన్నవు, నేడు గజాల చొప్పున భూములు అమ్ముతున్నావు ప్ర పంచ పెట్టుబడు లు ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ పాలసీ తెచ్చి నం. కాంగ్రెస్ మాత్రం భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తె స్తున్నరు. ఓఆర్ఆర్ లోప ల కాలుష్యం చేసే పరిశ్రమలను వెలు ప లకు పంపాలి.గ్రీన్ కంపెనీలు కూడా మీ పాలసీ ద్వారా తరలి వె ళ్తా యి. మీ వల్ల ఆ కంపెనీలు కూడా పోతాయి ఉపాధి ఉద్యోగాలు లే కుండాపోతాయి.
మాది ఖజానా నింపే పాలసీ, కాంగ్రె స్ ది వాళ్ల జేబులు నింపుకునే పా లసీ, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు వదిలి, దోచుకునే పాలసీలు తెస్తు న్నరు. గతంలో మేము కాలుష్య ప రిశ్రమల్లో 50శాతం భూ ముల్లో ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చని, మిగతా 50శాతం గృహ అ వసరాలకు వా డుకోవచ్చు అన్నం.కాంగ్రెస్ మాత్రం వాణిజ్య, వ్యా పార, రియల్ ఎస్టేట్ కోసం వినియోగించుకోవచ్చు అం టున్నది. రియల్ ఎస్టేట్ బ్రోకరీ ప్ర భుత్వం ఇది. బిజేపీ ఎందుకు మౌ నంగా ఉంది. కాంగ్రెస్ తో కుమ్మక్కు కాకుంటే విచారణ జరపాలని డి మాం డ్ చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని.. ఎనిమిది ప్రశ్నలు సూటిగా అ డుతున్నా. ప్రభుత్వ దోపిడినీ పూర్తి ఆధారాలతో బయటపెడు తు న్నా. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.సబ్ రిజిస్ట్రేషన్ వ్యా ల్యూ, టీజీఐఐసీ వ్యాల్యూ అని రెం డు ఉంటాయి. సాధార ణంగా టీజీ ఐఐసీ రేటు ఎక్కువగా ఉంటది. రెండు, మూడు రెట్లు ఉంటుంది. ప్రభుత్వానికి లాభం చేకూరాలని మేం టీజీఐఐసీ రేటు కు భూములు ఇచ్చినం. రేవంతు రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎస్ ఆర్ వో వ్యాల్యూలో కేవలం 30శాతం రేటు చెల్లించి భూములు కట్టబె డుతున్నది. టీజీఐ ఐసీ రేటు కాదని, ఎస్ ఆర్ వో రేటును ఎందుకు పరిగణలోకి తీసుకున్నరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం
హైదరాబాద్ లో ఎస్ ర్ వో ధరలు తక్కువగా ఉన్నయి, త్వరలో పెo చుతామని ప్రకటనలు చేసిన రేవం త్ ప్రభుత్వం. ఇప్పటి వరకు పెంచింది లేదు. ముందుగా ఓఆర్ఆర్ లో పల, ఆ తర్వాత బయట పెంచు తాం అన్నరు. అది అమలులోకి రాక ముందే ఈ పాలసీని ఎవరి మే లు కోసం తెచ్చారు? ఎందుకోసం హడావుడిగా అమలు చేస్తున్నారు? పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం, పేదలకు ఒక వి ధానం. సవరించిన భూముల రేట్లు కేవలం పేదలకేనా? ఓఆర్ఆర్ లోపల ఉన్న భూములు కట్టబెట్టడాన్ని ధరలు సవరించే వరకు ఎం దుకు ఆగటం లేదు. ఉదాహ రణకు వంద రూపాయలు గజం ఉం టే, బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందలు తీసుకొని ప్రభుత్వ ఖజా నా నింపింది. కానీ కాంగ్రెస్ ప్ర భు త్వం ఎందుకు 30రూపాయలకు త గ్గించింది? లక్షల కోట్లు రాకుండా రా ష్ట్ర ఖజానాకు నష్టం చేస్తు న్నది వా స్తవం కాదా, నాడు నో ఎల్ ఆర్ ఎ స్, నో బీ ఆర్ ఎస్ అ న్నడు రేవంత్ రెడ్డి.
అధికారంలోకి వచ్చాక ఒక పే దవాడు కొద్ది గజాల్లో భూమి కొని, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి సై తం ఎల్ ఆర్ ఎస్ వసూలు చేసా డు, ఒక పేదవాడు కొన్న భూమికి అయితే ఎస్ ఆర్ వో పై 60, 80 శా తం ఎల్ ఆర్ ఎస్ వసూలు చే సా రు, కానీ ఇప్పుడు కేవలం 30 శాతానికే మల్టిపుల్ జోన్ గా కన్వెర్ట్ చే స్తున్నారు. పేదవాడికి ఒక న్యా యం, పెద్దోడికి ఒక న్యాయం ఉం టదా? ఈ పాలసీ ఎవ రికో సం ప్ర భుత్వం సమాధానం చెప్పాలి? దసరాకు, దీపావాళికి ఆఫర్లు చూస్తుంటాం. కానీ ఈ పాలసీలో రేవంత్ రెడ్డి బొనాంజా పెట్టిండు. 30శాతానికి ల్యాండ్ కన్వర్ట్ చేయ డమే కాదు, ఈ 30శాతంలోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉన్నయి.
రెవెన్యూ, హెచ్ఎండీఏ కి ఒక్క రూపాయి కూడా కట్టనవసరంలేదు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, నాలా కన్వర్షన్.. ఇట్ల దేనికి దరఖా స్తు చేయడం అవసరం లేదు. కన్వ ర్షన్ రూపంలో హెచ్ ఎం డీఏకు వ చ్చే 13,500 కోట్ల రూపాయలు రాకుండా చేసిండు రేవంత్ రెడ్డి. ఓ ఆర్ఆ ర్ లోపల మాత్రమే కాదు, ఓఆర్ఆర్ చుట్టు పక్కల భూము లు కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో ఉంది. ఇది నిజమా కాదా సమాధానం చె ప్పాలి? రేవంత్ రెడ్డి, అనుముల బ్ర దర్స్ జేబులు నింపే పాలసీనా కా దా సమాధానం చెప్పాలి?ఆరు నెల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చే సారు. విలువైన భూములను, సగా నికి సగం అనుముల బ్రదర్స్ చేతు ల్లోకి పోయింది.
అగ్రిమెంట్లు చేసు కున్నరు. కమీషన్లు, వాటాలు కూ డా మాట్లాడు కున్నరు. ప్రీప్లాన్డ్ స్కాం ఇది. ఇది నిజామా కాదా సమా ధానం చె ప్పాలి? త్వరలో ఆ భూ ములు, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసారు కూడా బయటపెడుతాం?ఇది ముమ్మాటికి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్ఫర్మేషన్ పా లసీ. వీటన్నిటికి ఆర్ ఆర్ టాక్స్ అదనం.వచ్చే 30శాతం డబ్బును అయినా కొత్త పరిశ్రమలకు వాడుతరా, పారి శ్రామిక కారిడార్లు అభి వృద్ది చేయడం కోసం వాడుతరా? లేదా బడా బడా కాంట్రాక్టర్ల నుం చి కమీషన్లు తీసుకొని వారి బిల్లులు చెల్లించేందుకు వాడు తారా? ఎందుకుంటే ఇది టీజీఐఐసీ డబ్బు. సమాధానం చెప్పాలి.
ఈ ఎనిమిది ప్రశ్నలకు ప్ర భుత్వం సమాధానం చెప్పాలని బి ఆర్ఎ స్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తు న్నాం.పారిశ్రామిక వేత్తలకు మేము ఇన్సెంటివ్స్ ఇస్తే, మీరు బిల్డర్లు, వ్యాపారులుగా తయారు చేస్తున్నా రు.భారత దేశంలో ఇంత పెద్ద భూ స్కాం లేదు, దబిగ్గెస్ట్ ల్యాండ్ స్కాం ఇన్ ఇండియా అసెంబ్లీ పెట్టి వెంట నే చర్చకు పెట్టాలని డి మాండ్ చేస్తున్నాం. ఇది మీ అయ్య జాగిరి కాదు, నాలుగు కోట్ల ప్ర జల ఆస్తి.
తాతల తండ్రుల తరతరాల ఆస్తి ఇది. మీరు ఇష్టం వచ్చినట్లు అ మ్ముతం అంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.అసెంబ్లీ పెట్టి పాలసీపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జేబులు నింపుకో వడానికి పాలసీలు చేస్తే చూస్తూ ఊరుకోం బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. నిన్న కేటీఆర్ వేసిన ప్రశ్నలకు, నేను వేసిన 8 ప్ర శ్నలకు నిజాయితీ ఉంటే సమాధా నం చెప్పండి.తిట్టినా, కేసులు పెట్టి నా నిన్ను వద లం రేవంత్ రెడ్డి. ప్ర జ ల హక్కులు, ఆస్తులు కాపాడమే ప్ర తిపక్షం బాధ్యత. నిన్ను నిలదీ స్తూ నే ఉంటం. ప్రజా క్షేత్రంలో నీ తప్పు ల ను ఎండగడుతూనే ఉంటమని స్పష్టం చేశారు.
