Tuesday, September 29, 2026
More
    HomeOpinionMinister KomatiReddy Venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, స్వయం...

    Minister KomatiReddy Venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, స్వయం సహాయక మహిళాసంఘాల రైస్ మిల్లులు

    📰 Generate e-Paper Clip

     

    Minister KomatiReddy Venkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీ శ్వరులుగా తెచ్చిదిద్దాల న్న సంకల్పంతో మహిళల కోసం ఉచిత బ స్సు సౌకర్యం, బస్సులు, పె ట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాం టీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు చర్య లు తీసుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటిరెడ్డి వెంకట రె డ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రైస్ మిల్లుల కొరతను దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాల ద్వా రా రైస్ మిల్లులను నిర్వహించే బాధ్య తను కూడా వారికి అప్పగిం చాలని ఆలోచించినట్లు తెలిపారు. ప్రభుత్వమే మహిళా సంఘా లకు రుణం మంజూరు చేసి ఆర్ అండ్ బి శాఖ ద్వారా రైస్ మిల్లు లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.శనివారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భ వన్లో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వయం సహా యక మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు.

    మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఎక్క డా లేనివిధంగా పైలెట్ పద్ధతిన నల్గొం డ జిల్లాలో మహిళల చేత రైస్ మి ల్లులు ఏర్పాటు చేయిస్తామని, జిల్లాలో రైస్ మిల్లుల కొరత ను ఈ వి ధంగా తీరుస్తామని ,ఇందుకుగాను వారికి ముందుగా రు ణాలు అంద జేసి రైస్ మిల్లులను వారే నిర్వహించుకునేలా దానిపై వచ్చే లాభం ద్వా రా ప్రతినెల తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే లా, తద్వారా లాభం పొందే విధంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.

    ఇందుకుగాను అవసరమైన స్థలాలను చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదే శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి వచ్చే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యా ప్తంగా మహిళా స్వ యం సహాయక సంఘాల ద్వారా రైస్ మిల్లులు ఏ ర్పాటు చేసే విష యంపై చర్చించి ని ర్ణయం తీసుకునేలా చూస్తామని తెలిపారు. రా ష్ట్ర ప్రభుత్వం మహిళల కు ఉచిత బస్సు సౌకర్యాన్ని, బస్సు లను వారే నిర్వహించుకునేలా ఏ ర్పాటు చేయడం జరిగిందని, అం తేకా క ఇందిరా మహిళా శక్తి క్యాం టీన్ల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠ శా లల పనుల కేటాయింపు ,బడి పిల్లల యూనిఫామ్ లు కుట్టే బా ధ్యత అప్పగించామని, దీని ద్వారా మహి ళలు ఆర్థికంగా వారి కాళ్ల పై వారి ని లబడినమే కాకుండా, కుటుంబాలను పోషించుకుంటూ ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు.

    మహిళలు స్వయంకృషితో పైకి వ చ్చేందుకు పెట్రోల్ పంపులు కేటా యించామని, నల్గొండ జిల్లాలో రద్దీ ప్రాంతంలో ఎస్ఎల్బీసీలో ఏర్పా టు చేసిన పెట్రోల్ పంపు ద్వారా ప్రతినె ల 10 లక్షల ఆదాయం పొం దడానికి అవకాశం ఉందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి న తర్వా త మహిళల ఆత్మగౌరానికి తగ్గట్టు గా మహిళా సం ఘాల కే కాక రా ష్ట్రంలోని మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తు న్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మం త్రివర్గం చీరల డిజైన్ కు ఏ డాది పాటు ఆలోచించి మంచి నాణ్య మైన చీరలను మహిళలకు ఇ స్తున్నామని చెప్పారు.

    ఇందిరా మహిళా శక్తి చీరల పంపి ణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కో టి చీరలకు గాను, ప్రస్తుతం 65 లక్ష లు రావడం జరిగిందని ,మరో 35 లక్షలు రాగానే పట్టణాలలోని మ హిళలకు పంపిణీ చేస్తామని వెల్ల డించారు.రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో సు మారు 150 కోట్ల రూపా యలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠ శాలలను నిర్మిస్తున్నామని, న ల్గొండ జిజిహెచ్ , మెడికల్ కళాశాల లు ఎంతో అభివృద్ధి చేశామని, జిజి హెచ్ లో ప్రతినెల 800 డెలివ రీల తో పాటు, అత్యాధునిక శస్త్ర చికిత్స లు కూడా చేస్తున్నార న్నా రు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షల పెంచామన్నా రు.

    ధాన్యం కొ నుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా మని, తాను సొంత నిధులతో ఏ ఎం ఆర్పి కాలువలను బాగుచే యించానని, మహిళ లు పిల్లల్ని బాగా చ దివించుకోవాలని, వారు కుట్టుమి షన్ ల ద్వారా శిక్షణ పొందేందుకు, ఇతర నైపుణ్యాల అభి వృద్ధి కోసం న్యాక్ ద్వారా భవనాన్ని నిర్మిస్తున్నా మని, త్వరలోనే ప నులు పూర్తయితాయని, మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు.

    వచ్చే 3 సంవత్సరాల్లో నల్గొండ ని యోజకవర్గంలో పదివేల ఇండ్లు క ట్టించేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్రవ్యాప్తంగా 29 వేల కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లపై ఖ ర్చు చేయడం జరుగుతు న్నదని, 400 కోట్లతో నల్గొండ జిల్లాలో డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామ ని చెప్పా రు.

    ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడు తూ ప్రజా ప్రభుత్వం మహిళల కు పెద్దపీట చేస్తున్నదని, ఇందులో బా గానే మంచి నాణ్యమైన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామని, వడ్డీ లేని రుణాలు ,ఉచిత బస్సు, బస్సు నిర్వహణ వంటి సౌకర్యాలు కలగజేసామని ,వీటన్నిటిని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.

    జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లా డుతూ నల్గొండ జిల్లాలో ఇందిరా మహిళల శక్తి చీరల పంపిణీ కార్యక్ర మంలో భాగంగా నాలుగు లక్ష ల ఇ రవై నాలుగు వేల చీరలు ఇస్తున్నా మని, ఇవి మంచి సిల్క్, కాటన్ చీరలని, సిరిసిల్లలో తయారైనవని, అర్హులైన ప్రతి ఒక్కరికి చీర అం దించేలా చర్యలు తీసుకోవాలని అ న్నారు. మహిళా సం ఘాలు గ్రామా లలో నిర్వహించే సమావేశాలలో ఆర్థిక అంశాల తో పాటు, సామా జిక అంశాలను కూడా చర్చించా లని, ఏదైనా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ఆర్థికంగా సహాయం చేసి మహిళలు బాగుపడేందుకు సహకారం అందిస్తామని, మహిళలను కోటీశ్వరు లుగా చేయాలన్న చి త్తశుద్ధి ప్రభుత్వానికి ఉందని ,దాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు.

    అంతకుముందు జిల్లా గ్రామీణ అభి వృద్ధి అధికారి శేఖర్ రెడ్డి జిల్లా మ హిళా సంఘాల ద్వారా చేపడు తు న్న కార్యక్రమాలను వివరిం చారు. ఈ సందర్భంగా మంత్రి ఇందిరా మ హిళా శక్తి చీరల పంపిణీ తో పాటు, నల్గొండ నియోజకవర్గానికి సంబం ధించి రెండు కోట్ల 20 లక్షల రూపా యల విలువచేసే కళ్యాణ లక్ష్మి, షా ది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సం స్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధు లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.