Tuesday, September 29, 2026
More
    HomePoliticsTUWJ Warns : బిగ్ బ్రేకింగ్, టియూడబ్ల్యూజే హె చ్చరిక, కార్మిక కోడ్‌ల అమలు పత్రి...

    TUWJ Warns : బిగ్ బ్రేకింగ్, టియూడబ్ల్యూజే హె చ్చరిక, కార్మిక కోడ్‌ల అమలు పత్రి కా స్వేచ్ఛ మరియు మీడియా హక్కులకు తీవ్రమైన ముప్పు 

    📰 Generate e-Paper Clip

    TUWJ Warns : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నాలుగు కార్మిక కోడ్‌లను ఏకపక్షం గా అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడ బ్ల్యు జె) తీవ్రంగా ఖండిస్తోందని సం ఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారా యణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు అభిప్రాయప డ్డారు.ఈ చర్య భారతదేశంలో జర్న లిస్టులు, మీడియా కార్మికులు, అ లాగే పత్రికా స్వేచ్ఛ పై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయన్నారు.

    కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ కోడ్‌ లు 1955లోని వర్కింగ్ జర్నలిస్ట్స్ మరియు ఇతర న్యూస్‌పేపర్ ఎం ప్లాయీస్ (కండిషన్స్ ఆఫ్ సర్వీస్) అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ మరియు 1958లోని వర్కిం గ్ జర్నలిస్ట్స్ (ఫిక్సేషన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ వేజెస్) యాక్ట్ అనే రెండు చా రిత్రక చట్టాలను మాయం చేశాయ న్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు దశాబ్దాల పాటు చేసిన పోరాటాల ద్వారా సాధించిన ఈ చట్టాలు, మీ డియా యజమానులు, ప్రకటన దా రులు, రాజకీయ ప్రభావ కేంద్రాల నుండి జర్నలిజాన్ని స్వతంత్రంగా ఉంచే రక్షణాత్మక వ్యవస్థగా ఇంత కాలం పనిచేశాయని నేడు వాటిని ఏకపక్షంగా రద్దు చేయడం అన్యా యమన్నారు.

    ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీ డియా కార్మికులను కూడా ఈ చట్టా ల పరిధిలోకి తీసుకురావాల్సిందిగా జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్న స మయంలో, ప్రభుత్వం రక్షణలను విస్తరించాల్సింది పోయి మరింత కుదించే ప్రక్రియను ఎంచుకోవడం 29 చట్టాల స్తానంలో నాలుగు కోడ్ లు తీసుకువచ్చి జర్నలిస్టులను కల పడం అన్యాయమన్నారు.

    “ఇది పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేసినట్లే. వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ఒక సాధారణ కార్మిక చట్టం మాత్ర మే కాదు—మీడియా స్వతంత్రతకు రాజ్యాంగపరమైన హామీ అని దా న్ని కార్మిక కోడ్‌లలో విలీనం చేయ డం జర్నలిస్టుల కష్టపడి సాధించిన హక్కులను హరించడమే కాక, ప్ర జాస్వామ్యంలో మీడియా పోషించే కీలక పాత్రను బలహీనపరుస్తోం ద ని ఆవేదన వ్యక్తం చేశారు.“ఈ కో డ్‌ లు మీడియా రంగ నిపుణులతో గా నీ, జర్నలిస్ట్ సంఘాలతో గానీ సరై న సంప్రదింపులు జరపకుండా బల వంతంగా అమలు చేశారని,ఈ కా ర్మిక వ్యతిరేక మరియు మీడియా వ్యతిరేక కోడ్‌లకు ప్రతి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఖ చ్చితంగా ఉద్యమబాట పడతా మ ని హెచ్చరించారు.

    జాతీయ కనీస వేతనం, ప్రమాద పరిహారం వంటి అంశాలను, వేత నాల భద్రత,పనివేళల నియంత్రణ గురించి కోడ్ లో ప్రస్తావించినప్పటికీ జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం రూపం లో ఉంచి ఉంటే బాగుండేదని అభి ప్రాయపడ్డారు.కేంద్ర కార్మిక సంఘా లు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక ని పుణులు వ్యక్తం చేసిన అనేక అ భ్యంతరాలను పట్టించుకోకుండా ప్ర భుత్వం ఈ చర్య చేపట్టిందని ఆరో పించారు.

    కార్మిక సంఘాలతో ఐక్యత వ్యక్తం చేస్తూ టియుడబ్ల్యూజె డిమాండ్లు ఇలా ఉన్నాయి. నాలుగు కార్మిక కో డ్‌లను తక్షణ మే రద్దు చేయాలని,

    వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాలను పున రుద్ధరించి బలపరచాలని, ఎలక్ట్రా నిక్ మరియు డిజిటల్ మీడియా జ ర్నలిస్టులకు న్యాయ పరిరక్షణలను విస్తరించాలి. వర్కింగ్ జర్నలిస్టులు గా గుర్తించాలని, ప్రజాస్వామ్య చ ర్చల కోసం భారతీయ కార్మిక సద స్సును తక్షణమే నిర్వహించాల న్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జర్న లిస్టులు స్వేచ్ఛా, స్వతంత్ర జర్న లిజానికి పునాది అయిన హక్కు లను కాపాడేందుకు అప్రమత్తంగా, ఐక్యంగా ఉందామని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పిలుపునిస్తోందని వారు పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.