Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister ponnam prabhakar : బిగ్ బ్రేకింగ్, రవాణాశాఖమంత్రి అ ల్టిమేటం, ఎన్ఫోర్స్మెంట్ ను మరింత...

    Minister ponnam prabhakar : బిగ్ బ్రేకింగ్, రవాణాశాఖమంత్రి అ ల్టిమేటం, ఎన్ఫోర్స్మెంట్ ను మరింత కఠినతరం చేయండి

    📰 Generate e-Paper Clip

     

    Minister ponnam prabhakar : ప్రజా దీవెన, హైదరాబా ద్: రోడ్డు ప్ర మాదాలను పూర్తిగా తగ్గించి మ రణాల రేటును నివా రించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇం దు కోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖ లో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రా ష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో డిటిసి, ఆర్టి ఏ ఇతర అధికారులు నిరంతరం ఇందులో తనిఖీలు చేపడుతున్నారన్నారు. తనిఖీలు ఏ బృందం ఎక్క డ చేపడుతుందనే దానిపై ముందస్తు సమాచారం లే కుండా ప్రతి రోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమా చారం అందించి తనిఖీలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడా నికి కొ ద్ది రోజులుగా రవాణాశాఖ అమలు చేస్తున్న సంస్కరణలపై మరింత కఠి నతరం చేసేలా రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికా రులతో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వ హించారు.

    గత 10 రోజుల వ్యవధిలో తనిఖీ లు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యా ప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపైన 4748 కేసులు నమో దు చేయబడ్డాయి. మొత్తం 3420 వాహనాలు సీజ్ చేయబ డ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫో ర్స్మెంట్ బృందాలు మరిం త తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికా రుల ఆదే శించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమా దాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద ఎ క్కువగా దృష్టి సారిం చారని తెలిపారు.

    ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండో సా రి ఓవర్ లోడ్ తో వాహనం పట్టు బడి తే ఆ వాహనం పర్మిట్ రద్దు చే య డంతో పాటు, వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసె న్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోను న్నారు. అయితే ఓవర్ లోడ్ పై మై నింగ్ శాఖతో సమన్వయం చేసు కుంటూ ఎక్కడైతే వా హనాల లో డింగ్ జరుగుతుందో అక్కడే నివా రించేలా చర్యలు తీ సుకోవాలన్నా రు.హెవీ వెహికల్ డ్రైవర్ కి లైసెన్సు రెన్యువల్ స మ యంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీ సుకోవాలని సూచించారు.

    రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్న సమాచారాన్ని ప్రజల నుండి స మాచారం వచ్చిన రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించా లని ఆదేశించారు. గత సంవత్సరం నిర్వ హించిన రోడ్డు భద్రత మా సోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సారి జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొం దించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రై వర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా ఇప్పటి నుండి అవగాహన కల్పించాలని తెలిపారు.

    పాఠశాల నుండి కాలేజీ వరకు వ్యా సరచన పోటీలు, రోడ్డు నిబంధ నపై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చే యాలని ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వా మ్యం ఉండేలా చేసి ప్రమా దాలు తగ్గించి మరణాల రేటు నివారించేలా కార్యాచరణ తీసుకో వాలని రవాణాశాఖ అధికారులను ఆదేశిం చారు. రవాణాశాఖలో పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీ చేయడంతో పాటు , ప్రమోషన్లు పూ ర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    ప్రతి పది రోజులకు ఒకసారి ఎ న్ఫోర్స్మెంట్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. ఈ స మీక్ష సమావేశంలో స్పెషల్ చీ ఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి , రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , జాయింట్ ట్రా న్స్పో ర్ట్ కమిషనర్లు రమే ష్, చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్యలు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.