MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండ లం పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో పాఠశాల క్రీడా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న 69వ పాఠశా ల క్రీడా సమాఖ్య రాష్ట్ర స్థాయి కోకో క్రీడలను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో క లిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వల న చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే అనంతరం జాతీ య జెండాను ఆవిష్కరించి తెలంగా ణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల కోకో క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు.
ప్రస్తుత సమాజంలో విద్యార్థుల త ల్లిదండ్రులు ర్యాంకుల వేటలో పిల్ల లపై విపరీతమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారని క్రీడల విషయం లో ప్రోత్సాహం అందడం లేదని ఆ వేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలని ర్యాం కుల కోసమే కాకుండా క్రీడల్లో రా ణించే విధంగా తమ పిల్లల్ని ప్రోత్స హించాలని సూచించారు. వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రు ఆటలు ఆడాలని తద్వారా శా రీ రకంగా మానసికంగా దృఢంగా త యారవుతారన్నారు.తద్వారా అనా రోగ్యానికి గురికాకుండా మనల్ని మనమే కాపాడుకోవచ్చని తెలిపా రు.
కోకో క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీ డాకారునికి అభినందనలు తెలి పా రు. పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో రాత్రిపూట క్రీడల నిర్వ హ ణకు విద్యుత్ దీపాల అవసరం ఉ న్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసు కు రాగా వెంటనే ఏర్పాటు చేస్తామ న్నారు.

