Tuesday, September 29, 2026
More
    HomePoliticsEx Minister KTR : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్య, రియల్టర్లకు...

    Ex Minister KTR : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్య, రియల్టర్లకు కట్టబె ట్టేందుకు రేవంత్ కుట్రలు

    📰 Generate e-Paper Clip

    Ex Minister KTR : ప్రజా దీవెన, కుత్బుల్లాపూర్: రేవం త్ ప్రభుత్వం ప్రస్తుతం ఇండస్ట్రియ ల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పే రిట 9300 ఎకరాలను స్వాధీనం చే సుకొని రియల్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నిందని మాజీ మంత్రి కే టీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు తో కాంగ్రెస్ సర్కారు రూ.ఐదు లక్ష ల కోట్ల కుంభకోణానికి పాల్పడిం ద ని ఆరోపించారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రి యల్ ఏరియా లో బీఆర్ఎస్ నాయకులు గురువా రం కేటీఆర్ పర్యటించారు. ఆయా ప్రదేశాల్లో కార్మికులతో కాంగ్రెస్ స ర్కారు చేస్తున్న కుట్రలను వారికి వివరించారు.

    అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం లో గత ప్రభుత్వాలు పారిశ్రామిక అ వసరాల కోసం 9300 ఎకరాల స్థ లాలను రైతులు, ప్రజల దగ్గరి నుం డి సేకరించి పరిశ్రమలకు కట్టబెట్టిం దన్నారు. కాలుష్య కారక కంపెనీల ను తరలించడంలో బీఆర్ ఎస్ కు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అయితే ఉన్న పరిశ్రమలను గ్రీన్ ఇం డస్ట్రీ కింద మార్పు చేసి ఉత్పత్తుల ను ప్రోత్సహించి కంపెనీలను తర లించకుండా ఉంచితే అటు పరిశ్రమ లకు ఇంకో వైపు కార్మికులకు లాభ దాయకంగా ఉంటుందన్నారు.

    ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారంకు త్బుల్లాపూర్ ఏరియాలో గజం విలు వ 90 వేలకు పైగానే పలుకుతోంద ని, కానీ ప్రభుత్వం కార్డు వాల్యూ ద్వారా విక్రయించేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. మార్కెట్ రేటు ప్రకారం 9300 ఎకరాల విలువ 5 ల క్షల కోట్లకు పైగానే ఉంటుందని రే వంత్ సర్కార్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేష న్ పాలసీ పేరుతో సరి కొత్త దోపిడీకి తెరలేపిందని, దీనిని బీఆర్ఎస్ త ప్పకుండా అడ్డుకుంటుందని పరిశ్ర మలు తరలిపోకుండా, కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తుం దని అన్నారు.

    ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి స త్యవతి రాథోడ్ మేడ్చల్ జిల్లా బీ ఆ ర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శం భీపూర్ రాజు, బీఆర్ఎస్ విప్ ఎ మ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్యే లు మాధవరం కృష్ణారావు, మల్కా జ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి , పల్లారాజేశ్వర్ రెడ్డి, స త్యవతి రాథోడ్, కురువ విజయ్ కు మార్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.